Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/07/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే?

Updated : 19 Jul 2022 04:18 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. పరిచయంలేని వారి మాటలు వినకండి. సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. కలహసూచన ఉంది. చంద్ర శ్లోకం చదవడం మంచిది.

ధృడమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.
 

అప్రమత్తంగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యంపై  శ్రద్ధ అవసరం. నవగ్రహాలను పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

కార్యసిద్ధి ఉంది. చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో కలిసి ఆనందకరమైన కాలాన్ని గడుతారు. గోసేవ చేయడం మంచిది.

 

మంచి పనులు చేయడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీ స్తోత్రం చదివితే మంచిది.

చేపట్టిన పనులను నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. భోజన సౌఖ్యం ఉంది. మిత్రులతో కాలాన్ని గడుపుతారు. ఆదిత్య హృదయం చదవాలి.

మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. బంధు,మిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శని ఆరాధన శుభప్రదం.  

ప్రారంభించిన పనుల్లో జాప్యం వద్దు. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బందిపెట్టేవారు ఉన్నారు. చంద్ర ధ్యాన శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని  గొప్పవారిని చేస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం ఉత్తమం.
 

వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. కుటుంబ సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని