Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-10-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-10-2022)

Updated : 26 Oct 2022 03:51 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గ ధ్యానం చేస్తే మంచిది.

శుభఫలితాలున్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

ముఖ్యవిషయాల్లో అప్రమత్తత అవసరం. బద్ధకాన్ని దరిచేరనీయకండి. బంధువుల సహకారం అందుతుంది. బంధువులతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిష్ఠకు మచ్చతెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. ఆదిత్యహృదయం పఠిస్తే బాగుంటుంది.

సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యాన శ్లోకం చదవాలి.

మీదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం.

మానసికంగా ద్రుఢంగా ఉంటారు. ముఖ్య విషయాల్లో అమత్తంగా ఉండాలి.  చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. సాయి బాబా సందర్శనం మేలు చేస్తుంది.

చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు లేదా సొంతింటి నిర్మాణ వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. ఇంట్లోవారితో ఆనందంగా గడుపుతారు. కులదైవ సందర్శనం శుభప్రదం.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో శుభకాలం. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.

విజయ సిద్ధి కలదు. చేపట్టిన పనులను మీరు అనుకున్నవిధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో  మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది.

 

 మానసికంగా ద్రుఢంగా ఉంటారు. కుటుంబాభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శని జపం చేసుకోవాలి.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్దంగా వెళ్లకపోవడం వలన కొన్ని సమస్యలు తప్పవు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. దుర్గాస్తుతి పఠించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని