Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 12 May 2023 01:25 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.

శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన పద్ధతులను అవలంభించి లక్ష్యాన్ని సులువుగా చేరతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. చంద్రధ్యానం శుభకరం.

మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

ఏ పని తలపెట్టినా సకాలంలో పూర్తవుతుంది. సమాజంలో గొప్పపేరు సంపాదిస్తారు. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా  బాగుంటుంది.

ప్రారంభించబోయే పనిలో మనోబలం సర్వప్రధానం. కీలక వ్యవహారాలలో తోటివారి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం. 

మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణకార్యసిద్ధి ఉంది. సంపూర్ణమనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనుల్లో  చంచలత్వాన్ని రానీయకండి. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక విషయాల్లో సున్నితంగా ముందుకు సాగాలి. అష్టమ  చంద్ర దోషం ఉంది. దుర్గాధ్యానం శుభప్రదం.  

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిశ్రమ కాలం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.  

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల సహకారంతో మేలు జరుగుతుంది. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని