మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారం మహా జాతర సందర్భంగా వనదేవతలకు భక్తజనం సమర్పించుకున్న కానుకల హుండీ లెక్కింపు ప్రారంభమైంది. సబ్బండ వర్గాల సంబరం...

Published : 12 Feb 2020 14:07 IST

వరంగల్‌ అర్బన్‌: మేడారం మహా జాతర సందర్భంగా వనదేవతలకు భక్తజనం సమర్పించుకున్న కానుకల హుండీ లెక్కింపు ప్రారంభమైంది. సబ్బండ వర్గాల సంబరం నాలుగు రోజుల పాటు కోలాహలంగా సాగిన విషయం తెలిసిందే. ఈ జాతరకు సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు విచ్చేసి వన దేవతలను దర్శించుకొని పునీతులయ్యారు. ఈ ఏడాది జరిగిన జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో బుధవారం ఉదయం హుండీల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. దేవాదాయ శాఖ అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, మేడారం ఆలయ ఈవో రాజేంద్ర ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు వారం రోజుల పాటు మొత్తం 494 హుండీలను 200 మంది సిబ్బంది లెక్కించనున్నట్లు మేడారం ఆలయ ఈవో రాజేంద్ర తెలిపారు. గతంలో జరిగిన జాతరలో మేడారం ఆదాయం రూ.10కోట్లు వచ్చిందని తెలిపారు. ఈ సారి రూ.10కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని