వివేకా హత్యకేసు:తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ పూర్తయింది. విచారణలో భాగంగా సేకరించిన శవపరీక్ష నివేదిక, జనరల్‌ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు.

Published : 25 Feb 2020 00:50 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ పూర్తయింది. విచారణలో భాగంగా సేకరించిన శవపరీక్ష నివేదిక, జనరల్‌ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు మెమో దాఖలు చేయడంపై వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పిటిషన్‌ ఉపసంహరణపై జగన్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. త్వరలో ఈ కేసుపై తుది తీర్పు వెలువరించే అవకాశముంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని