పది పరీక్షలు రద్దు..ఏపీ అధికారిక ఉత్తర్వులు

కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్టు పేర్కొంది.

Updated : 14 Jul 2020 16:06 IST

అమరావతి: కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్టు పేర్కొంది. ఎస్ఎస్‌సీ, ఓఎస్ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణుల్ని చేసినట్లు ప్రకటించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని