ఉన్నోళ్లవి తొలగించి.. పోయినోళ్లవి ఉంచి..

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు నమోదు చేయడంతో పాటు మరణించిన వ్యక్తుల ఓట్లు తొలగించడం సాధారణం.

Updated : 28 May 2023 05:23 IST

తప్పుల తడకగా ఓటర్ల జాబితా

జాబితాలో కృష్ణయ్య ఓటు తొలగించిన అధికారులు

ఏర్పేడు, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు నమోదు చేయడంతో పాటు మరణించిన వ్యక్తుల ఓట్లు తొలగించడం సాధారణం. దీనికి భిన్నంగా ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో మరణించిన వ్యక్తుల ఓట్లను ఉంచి బతికున్నోళ్ల ఓట్లను తొలగించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రామానికి చెందిన సుమారు పది మంది వ్యక్తుల కుటుంబంలో చనిపోయిన వారి ఓట్లను ఉంచి కుటుంబ పెద్దల ఓట్లను తొలగించి నూతన ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తమ కుటుంబంలో ఒకరు చనిపోతే తనది తొలగించారని కృష్ణయ్య వాపోయారు. తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తమ ఓట్లు ఉన్నాయో లేదోనని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని