Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Sep 2023 09:22 IST

1. పోలవరంలో ఇదేం దారుణం!

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండానే పనులు చేసేస్తున్నారా? ఆ సంస్థలు అనుమతి ఇవ్వకుండానే రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తోందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు తెలిసింది. దిల్లీలో నాలుగు రోజుల కిందట కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి నిర్వహించిన కీలక సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి పీపీఏ తాజా పరిస్థితిని నివేదించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అదిగో.. ద్వారక..!

చిలిపికృష్ణుడిగా గోవులకాపరిగా రాధామనోహరునిగా గీతాప్రబోధకునిగా కోట్లాది భక్తుల గుండెల్లో గూడు కట్టుకున్న శ్రీకృష్ణుడి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. కానీ గోమతీనది అరేబియా సముద్రంలో కలిసేచోట నిర్మించిన ద్వారకాధీశుని ఆలయం పౌరాణికంగానూ చారిత్రకంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే ఏటా లక్షలాదిమంది ఆ ఆలయంలో కొలువుదీరిన ఆ దేవకీసుతుణ్ణి దర్శించుకుని జన్మ ధన్యమైనట్లుగా భావిస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆటో - లారీ ఢీ: ఐదుగురి దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఆటో - లారీ ఢీకొని ఐదుగురు మరణించారు. గుంటూరు - కర్నూలు ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కోట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వ్యాయామమే ‘వెన్ను’దన్ను

జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల గురించి ఎక్కువ ఆందోళన చెందుతుంటాం. వాస్తవంగా అత్యధికులు వెన్నునొప్పితో సతమతమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. తాజాగా నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ‘బ్యాక్‌ పెయిన్‌’ కథనం వెన్ను సమస్యకు సంబంధించి పలు ఆందోళనకర అంశాలను వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గిరిజన యువతి వైద్యానికి.. 25 కి.మీ. చెక్కబల్లపై తరలింపు

 దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కనీస సదుపాయాల్లేక కునారిల్లుతున్న గిరిజన గ్రామాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతి (17) జబ్బుపడగా.. ఆమెను ఓ చెక్కబల్లపై పడుకోబెట్టి 25     కి.మీ.ల దూరం భుజాలపై మోస్తూ గడ్చిరోలి జిల్లా లహెరి పీహెచ్‌సీకి బంధువులు తరలించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాబోతున్నాయా.. ముకేశ్‌ హోటళ్లు!

ముకేశ్‌ అంబానీ ఏ రంగంలో అడుగుపెట్టినా.. అది సంచలనమే. ఎందులోనైనా దూకుడు ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. ఇప్పటికే టెలికాం, రిటైల్‌లో దూసుకెళుతున్న ముకేశ్‌.. హరిత ఇంధనం, ఆర్థికంపైనా దృష్టి సారించారు. తాజాగా హోటళ్ల వ్యాపారంలోకీ అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఒక దశాబ్దం నుంచీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పలు రంగాల్లోకి అడుగుపెడుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మేక పోయిందని.. మానవత్వం మరచి..

మేక ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పశువుల కాపరితోపాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసింది.. ఆపై తల కింద పొగబెట్టి చిత్రహింసలకు గురి చేసింది. ఈ అమానవీయ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్‌ అంగడిబజార్‌ ప్రాంతంలో నివాసముంటున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘కాల్చి పడేస్తా’ వ్యాఖ్యలు ఈసీ దృష్టికి

నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ‘భారాస జోలికొస్తే కాల్చి పడేస్తా’ అంటూ గత ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లిలో ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ సభ్యుడు సి.నిరంజన్‌, కన్వీనర్‌ పి.రాజేశ్‌కుమార్‌లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇంటింటికీ వెళ్లండి..నా మాటగా చెప్పండి..

‘బాదుడే బాదుడు ప్రారంభించినప్పట్నుంచి వైకాపా ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. ఒంగోలులో మహానాడుకు రానీయకుండా అడ్డుకుంటామంటే ప్రభంజనంలా ప్రజలు వచ్చారు. రాజమహేంద్రవరంలో మహానాడు బ్రహ్మాండంగా జయప్రదమైంది.. అదే తెదేపా శక్తి, సామర్థ్యం, కార్యకర్తల బలం’. ‘తెదేపా అధికారంలో ఉండి ఉంటే.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి గోదావరి జిల్లాలకు మూడు పంటలకు నీళ్లిచ్చేవాళ్లం. నదులు అనుసంధానం చేసిఉంటే రైతులకు మేలు జరిగేది. కరవు ఉండేది కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ హోటల్‌ ఆదాయం నెలకి నాలుగున్నర కోట్లు!

ప్రముఖ ట్రేడ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఉడాన్‌’ సహవ్యస్థాపకుడు సుజిత్‌కుమార్‌ ఈ మధ్య ఓ పాడ్‌కాస్ట్‌లో- జీరోగా మొదలై హీరోగా ఎదిగిన ‘రామేశ్వరం కెఫె’ గురించి మాట్లాడాడు. ‘10/10 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉండే రామేశ్వరం కెఫెలో రోజుకు ఏడున్నర వేల మందికి వడ్డిస్తూ... నెలకు నాలుగున్నర కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నారు. 70శాతం లాభాలు పొందుతున్నారు’ అని సుజిత్‌  ఎంతో గొప్పగా చెప్పిన ఆ హోటల్‌ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని