గిరిజన యువతి వైద్యానికి.. 25 కి.మీ. చెక్కబల్లపై తరలింపు

దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కనీస సదుపాయాల్లేక కునారిల్లుతున్న గిరిజన గ్రామాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి.

Updated : 03 Sep 2023 08:43 IST

నాగ్‌పుర్‌: దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కనీస సదుపాయాల్లేక కునారిల్లుతున్న గిరిజన గ్రామాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతి (17) జబ్బుపడగా.. ఆమెను ఓ చెక్కబల్లపై పడుకోబెట్టి 25     కి.మీ.ల దూరం భుజాలపై మోస్తూ గడ్చిరోలి జిల్లా లహెరి పీహెచ్‌సీకి బంధువులు తరలించారు. బస్తర్‌ జిల్లాలోని వెనుకబడ్డ ప్రాంతమైన మెటవాడ గ్రామానికి చెందిన ఆ యువతి తీవ్రజ్వరంతో బాధపడుతున్నట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి శంభాజీ భోక్రె తెలిపారు. వెంటనే చికిత్స ప్రారంభించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వర్షాకాలం తర్వాత మలేరియా కేసులు పెరగటంతో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు గ్రామాల నుంచి రోజుకు నలుగురైదుగురు తమ ఆసుపత్రికి చికిత్స కోసం వస్తున్నట్లు చెప్పారు. ఎగుడుదిగుడు కొండ ప్రాంతాల్లో వీరు నివాసం ఉంటున్నందున అంబులెన్సులు ఉన్నా వెళ్లలేని పరిస్థితి ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని