Vitamin D: విటమిన్‌ డి ఉంటే.. ఆనందం మీ సొంతం..! ఎలాగో తెలుసా..?

ఒక్కో విటమిన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని శరీరంలోని కొన్ని భాగాలకు ఉపకరిస్తే..కొన్ని మానసిక ఉల్లాసం కలిగించడానికి దోహద పడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రదానమైనది డి విటమిన్‌. ఇది మనకు ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధకతనే కాదు..ఆనందం, ఉల్లాసం కూడా అందించనుందని పేర్కొంటున్నారు.

Published : 07 Oct 2022 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కో విటమిన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.   వీటిల్లో కొన్ని శరీరంలోని ప్రత్యేక భాగాలకు ఉపకరిస్తే.. మరికొన్ని మానసిక ఉల్లాసానికి దోహద పడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనది ‘డి విటమిన్‌’. ఇది మనకు ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధకతనే కాదు.. ఆనందం, ఉల్లాసం కూడా అందించనుందని పేర్కొంటున్నారు. విచారంగా ఉండటం, కోపం, చిరాకు పడటం వెనక కూడా ‘డి విటమిన్‌’ లోపమే కారణమని తెలుస్తోంది. ఇంకా ఈ విటమిన్‌ ఏం చేస్తుందో తెలుసుకోండి..!

* శారీరక ఆరోగ్యానికే కాదు..మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఆహారంతో లభించే కాల్షియాన్ని శరీరం బాగా గ్రహించేలా చేస్తుంది. ఎముకలు గుల్ల బారకుండా చూస్తుంది.

* రోగ నిరోధకశక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటిని పోగొడుతుంది.

* కుంగుబాటును నివారిస్తుంది. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషాన్ని కలిగిస్తుంది. మన మెదడు సక్రమంగా పని చేయడానికి న్యూరో స్టెరాయిడ్లను వాడుకుంటుంది. 

* మానసిక సమస్యలకు ‘విటమిన్‌ డి’తో ప్రత్యక్ష సంబంధం ఉంది.

* విటమిన్‌ డిలో చాలా రకాలున్నాయి. చర్మానికి ఎండ తగిలినపుడు 7 డి హైడ్రో కొలెస్ట్రాల్‌ పుడుతుంది. ఇది డి3గా మారుతుంది. ఇది కాలేయాన్ని చేరుకొని 25 హైడ్రాక్సీ విటమిన్‌ డి అవుతుంది. శరీరం దీన్నే వాడుకుంటుంది. రోజూ కాసేపు ఎండ తగిలేలా చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. 

* ఎండతో సెరటోన్‌ హర్మోన్‌ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక స్థితిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుంది. కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని