Kadapa: కడపలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

కడపలో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

Updated : 10 Aug 2023 10:43 IST

కడప (నేర వార్తలు): కడపలో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేడ్కర్‌ కూడలి, కోర్టు రోడ్డు, భరత్ నగర్, చెన్నై రోడ్డు, మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, అక్కయ్యపల్లి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రోడ్లపై మోకాల్లోతు వరకు వర్షపునీటితో వాహనాలు మొరాయించాయి. కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అక్కయ్యపల్లెలోని పాత గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళన గురయ్యారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు నగరపాలక అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని