AP Exams: ఏపీలో పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి నెలలో పది, ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 16 Dec 2023 20:17 IST

అమరావతి: ఏపీలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ (Tenth and Inter Exams Schedule) విడుదలైంది. మార్చి నెలలో పది, ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వెల్లడించారు. మార్చి 18 నుంచి పదో తరగతి, మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఉంటాయన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

  • 18-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (గ్రూప్‌-A)
  • 18-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (కాంపోజిట్‌ కోర్స్‌)
  • 19-03-2024 - సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • 20-03-2024 - ఇంగ్లీష్‌
  • 22-03-2024 - గణితం
  • 23-03-2024 - ఫిజికల్‌ సైన్స్‌
  • 26-03-2024 - బయోలాజికల్‌ సైన్స్‌
  • 27-03-2024 - సోషల్‌ స్టడీస్‌
  • 28-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (కాంపోజిట్‌ కోర్స్‌)
  • 28-03-2024 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌) 
  • 30-03-2024 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
  • 30-03-2024 - ఎస్‌ఎస్‌సీ వొకేషనల్‌ కోర్స్‌ (థియరీ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని