సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి రూ.2.28 కోట్లు: కేటీఆర్‌

కరోనా సోకితే దారుణమైన నేరంగా భావించొద్దని తెలంగాణ మంత్రి కె. తారకరామరావు అన్నారు. సిరిసిల్లా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిమిత్తం పర్యటిస్తున్న ఆయన.. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ వార్డు, 40 పడకల ఆక్సిజన్‌ వార్డు, కొవిడ్‌

Published : 03 Aug 2020 15:08 IST

సిరిసిల్ల: కరోనా సోకితే దారుణమైన నేరంగా భావించొద్దని తెలంగాణ మంత్రి కె. తారకరామరావు అన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిమిత్తం సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ వార్డు, 40 పడకల ఆక్సిజన్‌ వార్డు, కొవిడ్‌ అంబులెన్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రికి సీఎస్‌ఆర్‌ పథకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా బాధితులందరికీ హోంఐసోలేషన్‌ కిట్లు అందిస్తామని చెప్పారు. బాధితుల సంఖ్య పెరిగితే రెండు పడక గదుల ఇళ్లను కూడా ఐసోలేషన్‌ కేంద్రాలుగా వాడుకోవాలని  వైద్యశాఖ అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని