Harish Rao: విద్యార్థులకు త్వరలో ఉపకార వేతనాలు.. వెంటనే అందించాలని మంత్రి ఆదేశం

తెలంగాణలో విద్యార్థులకు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మార్చి నెలాఖరు వరకు

Published : 05 Jul 2022 01:42 IST

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యార్థులకు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మార్చి నెలాఖరు వరకు ఇవ్వాల్సిన ₹362.88 కోట్లను విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల విడుదలపై మంత్రి ఇవాళ సమీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ యోగితా రాణా, తదితర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

ఆరు శాఖలకు సంబంధించిన ₹362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు బిల్లులు అందకపోవడంతో తిరిగి పంపిన వివరాలను మళ్లీ ట్రెజరీకి సమర్పించాలని చెప్పారు. వీటిని వెంటనే క్లియర్ చేయాలని ట్రెజరీ అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాల బీఆర్వోలను కూడా విడుదల చేయాలని సంబంధిత అధికారులను హరీశ్ రావు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని