TS news: సింగరేణిలో పదవీవిరమణ వయస్సు పెంపు

సింగరేణిలో పదవీవిరమణ వయస్సు 61 ఏళ్ల పెంపునకు బోర్డు ఆప్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయనున్నారు

Updated : 26 Jul 2021 16:18 IST

హైదరాబాద్‌: సింగరేణిలో పదవీవిరమణ వయస్సు 61 ఏళ్ల పెంపునకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయనున్నారు. దీంతో మార్చి 31 నుంచి జూన్‌ 30 మధ్యలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, అధికారులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే విధివిధానాలను వెల్లడిస్తామన్నారు. పెళ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలకు కూడా కారుణ్య నియామకాల్లో అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ అమలుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగ భేదం లేకుండా అవకాశాల అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు శ్రీధర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని