Andhra News: కడప రిమ్స్‌ డెంటల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఛాంబర్‌కు సీల్‌

కడప రిమ్స్ దంత వైద్య కళాశాలలో ప్రిన్సిపల్ ఛాంబర్‌కు వైద్య సిబ్బంది సీల్ వేశారు. మూడు రోజుల కిందట ఛాంబర్‌లోకి ఎవరూ

Updated : 18 Apr 2022 11:27 IST

కడప: కడప రిమ్స్ దంత వైద్య కళాశాలలో ప్రిన్సిపల్ ఛాంబర్‌కు వైద్య సిబ్బంది సీల్ వేశారు. మూడు రోజుల కిందట ఛాంబర్‌లోకి ఎవరూ వెళ్లకుండా ఈ చర్యకు పాల్పడ్డారు. ప్రిన్సిపల్ సీటు కోసం సీనియర్, జూనియర్ దంత వైద్యుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా సీల్ వేసినట్లు తెలుస్తోంది. రిమ్స్ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా ఇటీవలే సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రిన్సిపల్‌గా రావడాన్ని ఇక్కడి దంత వైద్యకళాశాల సీనియర్ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

తన ఛాంబర్‌లోకి ఎవరూ వెళ్లకుండా సీల్‌ వేయాలని సురేఖ మూడు రోజుల కిందట స్థానిక సిబ్బందిని ఆదేశించి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. మరోవైపు పది రోజుల కిందట యుగంధర్ అనే వ్యక్తి ప్రిన్సిపల్‌గా వచ్చి బాధ్యతలు చేపట్టిన అనంతరం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన తర్వాత సురేఖ రావడంతో ఇక్కడ అంతర్గత విభేదాలు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. ప్రిన్సిపల్ ఛాంబర్‌కు సీల్ వేసిన ఘటనపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారమైన కథనానికి కళాశాల సిబ్బంది స్పందించారు. ఛాంబర్‌కు వేసిన సీల్‌ను తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని