ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2

చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌) నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది.

Updated : 10 Feb 2023 09:48 IST

శ్రీహరికోట: చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌) నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై.. 6.30 గంటలపాటు కొనసాగింది. అనంతరం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి బయలుదేరింది. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవోఎస్‌-07 ఉపగ్రహంతో పాటు యూఎస్‌ఏ అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1, చెన్నై స్పేస్‌కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్‌-07, 880 సెకన్లకు జానుస్‌-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీశాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని