TS News: రిజిస్ట్రేష‌న్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సడ‌లింపు నిబంధ‌న‌లు పొడిగించిన నేప‌థ్యంలో రిజిస్ట్రేష‌న్ల‌పై కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. స‌డ‌లింపు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా భూములు..

Published : 31 May 2021 01:06 IST

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సడ‌లింపు నిబంధ‌న‌లు పొడిగించిన నేప‌థ్యంలో రిజిస్ట్రేష‌న్ల‌పై కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. స‌డ‌లింపు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా భూములు, ఆస్తులతో పాటు వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తివ్వాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్రంలో మ‌రో ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్ర‌భుత్వం.. క‌ర్ఫ్యూ స‌డ‌లింపును ఉద‌యం 6 నుంచి ఒంటి గంట వ‌ర‌కు పెంచింది. ఇప్పటి వరకు ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే స‌డ‌లింపు ఉండ‌టంతో రిజిస్ట్రేష‌న్ల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. తాజా నిర్ణ‌యంతో రేప‌టి నుంచి రిజిస్ట్రేష‌న్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని