
Updated : 05 Dec 2021 12:45 IST
Konijeti Rosaiah: రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు
హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయడు నివాళులు అర్పించారు. నగరంలోని బల్కంపేటలో ఉన్న రోశయ్య నివాసానికి వెళ్లిన చంద్రబాబు .. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రబాబుతో పాటు తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు తదితరులు.. రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రోశయ్య మరణం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. పదవులకే ఆయన వన్నె తెచ్చారని కొనియాడారు. అందరితో రాజకీయాలకతీతంగా మెలిగారని, రికార్డు స్థాయిలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.
Tags :