Cm Jagan: మహిళా సాధికారతకు సహకారించాలి.. బ్యాంకర్లకు సీఎం జగన్‌ విజ్ఞప్తి

కొవిడ్‌ విపత్తు కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పంపిణీ వ్యవస్థ, ఉపాధి మార్గాలు దెబ్బతిన్నాయన్నారు. బ్యాంకర్ల సహకారంతో....

Updated : 09 Sep 2021 17:36 IST

అమరావతి: కొవిడ్‌ విపత్తు కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పంపిణీ వ్యవస్థ, ఉపాధి మార్గాలు దెబ్బతిన్నాయన్నారు. బ్యాంకర్ల సహకారంతో రాష్ట్రం సమర్థ పనితీరు కనబరిచిందని సీఎం వెల్లడించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సీఎం సమావేశమయ్యారు. 2020-21లో దేశ జీడీపీ 7.25 శాతం తగ్గితే ఏపీలో 2.58 శాతం మాత్రమే తగ్గిందని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే టర్మ్‌ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. సాగు రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ జరిగిందని.. పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చామన్నారు.

కౌలు రైతులకు రుణాలపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లను సీఎం జగన్‌ కోరారు. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను తీర్చిదిద్దాలని.. మహిళా సాధికారత కోసం బ్యాంకర్ల సహకారం ఉండాలన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.35 వేలు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు చొరవ చూపాలని కోరారు. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే.. మిగిలిన వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. చిరు వ్యాపారులకు రుణాల మంజూరు, ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకర్లు అండగా ఉండాలని సీఎం కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని