icon icon icon
icon icon icon

Chandrababu: జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహి.. ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Updated : 06 May 2024 19:28 IST

అనకాపల్లి: ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. 2047లో వికసిత్‌ భారత్‌.. మోదీ లక్ష్యమైతే.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌.. తన లక్ష్యమన్నారు. అనకాపల్లిలోని రాజుపాలెంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. కూటమి మ్యానిఫెస్టో ముందు వైకాపా మ్యానిఫెస్టో వెలవెలబోయిందన్నారు. 25 లోక్‌సభ, 160 శాసనసభ సీట్లలో కూటమిదే విజయమన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు, అమరావతి నిర్మాణ కోసం, తెలుగు భాషను కాపాడేందుకే మూడు పార్టీల కలయిక అని వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. ప్రజల భూముల పత్రాలపై జగన్‌ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చుపెట్టినా జగన్‌ ఓడిపోవడం ఖాయమన్నారు. మోదీ గ్యారంటీలు, కూటమి మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  

‘‘వైకాపా ఉత్తరాంధ్ర ద్రోహి. సాగునీటి ప్రాజెక్టుల కోసం తెదేపా హయాంలో రూ.2,500 కోట్లు ఖర్చుపెడితే, జగన్‌ ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చింది. తెదేపా అధికారంలో ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తయి ఉండేవన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడి ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్‌. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న రూ.3 వేల పింఛన్‌ను రూ. 4వేలకు పెంచుతాం. ఏప్రిల్‌ నుంచే దానిని అమలు చేస్తాం. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛను అందిస్తాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే. ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు రద్దుపై రెండో సంతకం పెడతా. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం చేస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img