HYD: అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: హైదరాబాద్‌ సీపీ

నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ

Published : 27 Sep 2021 14:13 IST

హైదరాబాద్: నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం అయింది. హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్ అంజనీ కుమార్ ఉన్నతాధికారులు, సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు గానీ, పెట్రోలింగ్ సిబ్బందికి గానీ సమాచారం ఇవ్వాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని