Ts News: జగన్‌ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం: సీబీఐ

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో జగన్‌ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని

Published : 06 Dec 2021 16:43 IST

జగన్‌ హాజరు మినహాయింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో జగన్‌ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ హైకోర్టుకు తేల్చి చెప్పింది. మినహాయింపు ఇస్తే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో సీబీఐ నిరాకరించినట్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. జగన్‌ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి పదేళ్లయినా కేసులు ఇంకా డిశ్చార్జ్‌  పిటిషన్ల దశలోనే ఉన్నాయని కోర్టుకు వివరించింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది. సీబీఐ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సీబీఐ కోర్టులో జగన్‌ హాజరు మినహాయింపు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని