TS News: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated : 23 Jul 2023 15:52 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రోజులు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ దక్షిణ ఒడిశా పరిసరాలలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. 

మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఉత్తర్వులు జారీ

ఇవాళ కూడా షియర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ - 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. 24న ఒక అల్పపీడనం దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని