Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 May 2024 08:59 IST

1. ఆ పల్లెల్లో ఓట్ల పండగే

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో గ్రామీణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రాల ముందు పోటెత్తారు. పలు గ్రామాల్లో 95 శాతానికిపైగా పోలింగ్‌ జరిగింది. అర్ధరాత్రి 11.30 గంటల వరకు పోలింగ్‌ జరగడం విశేషం. అయినా ఓటర్లు విసుగు చెందకుండా ఎంతో బాధ్యతతో అర్ధరాత్రి వరకు పోలింగ్‌ కేంద్రాల్లో ఉండి ఓటు వేయడం ద్వారా చైతన్యాన్ని చాటారు. పూర్తి కథనం

2. పట్టభద్రులూ.. ఓటు వేయాలి ఇలా..!

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్‌ విధానంలో తేడాలున్నాయి. చాలా మందికి ఓటు వేసే విధానం తెలియక చేసే పొరపాట్లతో ఓటు చెల్లకుండా పోయే పరిస్థితి ఉంటుంది. పూర్తి కథనం

3. దయచేసి వినండి.. మీ రైలు రద్దయింది!

‘‘విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు (ట్రాఫిక్‌ బ్లాక్‌) పేరుతో అధికారులు భారీగా రైళ్లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యాధునిక వ్యవస్థ కలిగిన రైల్వే శాఖ ఏడాదిగా నిర్వహణ పనులు చేపట్టడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. గత కొంతకాలంగా పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది.’’పూర్తి కథనం

4. ఔటర్‌ చుట్టూ.. ఔరా అనిపించేలా

రాష్ట్రంలో కొత్తగా ఐటీ సంస్థలు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఔటర్‌ చుట్టూ వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారుల కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఔటర్‌కు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, విమానాశ్రయానికి దగ్గరగా ఉండే మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు.పూర్తి కథనం

5. చంద్రబాబే ముఖ్యమంత్రి!

తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. మంగళవారం విశాఖ నగరానికి విచ్చేసిన ఆయన  సీతమ్మధార కేఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్‌ 4వ తేదీన వైకాపా నాయకులు కనబడరని జోస్యం చెప్పారు. దేవుడు అతి తీవ్రంగా కరుణిస్తే ఆ పార్టీకి 50 సీట్లు.. లేకుంటే 25 మాత్రమే వస్తాయని తెలియజేశారు. పూర్తి కథనం

6. అణువణువూ జల్లెడ పట్టాల్సిందే!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్‌ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది.పూర్తి కథనం

7. గూగులమ్మ ఇంట ఏఐ పంట

గూగులమ్మ ఇంట ఏఐ పంటటెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్‌ వార్షిక డెవలపర్‌ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. అభివృద్ధి చేస్తున్న టూల్స్‌నూ పరిచయం చేసింది. హోంవర్క్‌లో సాయం చేసే టూల్స్‌ దగ్గరి నుంచి పదాలతోనే సినిమా స్థాయి వీడియోను రూపొందించే మోడల్‌ వరకూ ఎన్నెన్నో వీటిలో ఉన్నాయి. పూర్తి కథనం

8. తెదేపాకు ఓట్లేశారు.. మీకు నీళ్లిచ్చేది లేదు

‘మీరు తెదేపా వాళ్లు.. మా ప్రభుత్వ నిధులతో వేసిన డీప్‌ బోరు నీటిని మీకు ఇచ్చేది లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ వైకాపా నాయకులు సరఫరాను నిలిపివేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి కథనం

9. విపక్షాలది మోసగాళ్ల కూటమి

తీవ్రమైన మతతత్వ, కులతత్వ, వారసత్వ రాజకీయాలను వందశాతం చేస్తున్న ‘ఇండియా’ కూటమి మోసగాళ్ల కలయికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై దాడికి దిగారు. రూ.20 లక్షల కోట్ల కుంభకోణాలకు బాధ్యులైన వీరంతా రాజకీయ కూటమిలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించారు.పూర్తి కథనం

10. మదుపర్ల సంపద@ 5లక్షల కోట్లు

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బీఎస్‌ఈలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రికార్డు గరిష్ఠమైన రూ.414.62 లక్షల కోట్లుగా నమోదైంది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని