Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 22 Jun 2023 09:01 IST

1. రుతుపవనాలు కదిలాయి.. ఇక వానల జోరు

ఎట్టకేలకు రుతుపవనాలు కదిలాయి. ఇంతకాలం ఎండల వేడి, ఉక్కపోతలతో అల్లాడిన రాష్ట్రంపై చల్లనిగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి అయిదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని, ఇవి కురిసే తీరును బట్టి నైరుతి రుతుపవనాలు గురువారం తెలంగాణలో విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. White House: ప్రధాని పిలుపు మేరకు శ్వేతసౌధం విందులో చిరుధాన్యాల వంటకాలు..!

ప్రపంచ వ్యాప్తంగా చిరుధాన్యాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ చేస్తున్న యత్నానికి అమెరికా తొలి మహిళ జిల్‌ బైడెన్‌ స్పందించారు. నేడు శ్వేత సౌధం(White House) మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందు మెనూలో చిరుధాన్యాల వంటకాలను కూడా చేర్చారు. ఆమె గెస్ట్‌ చెఫ్‌ నీనా కుర్టిస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు శ్వేత సౌధం ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ క్రిస్‌ వెల్లడించారు. ఈ అధికారిక విందుకు సంబంధించిన మెనూను శ్వేతసౌధం పేస్ట్రీ చెఫ్‌ సుసీ మారిసన్‌ తయారు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 5 హత్యలు.. ఆరుగురికి కత్తిపోట్లు.. వణికిన రాజధాని

మహానగరం బుధవారం వరుస హత్యలతో వణికిపోయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. కేవలం 15 గంటల వ్యవధిలో అయిదు హత్యలు, ఆరుగురికి కత్తిపోట్ల ఘటనలు కలకలం సృష్టించాయి. శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండే గ్రేటర్‌ పోలీసులకు సవాల్‌ విసిరాయి. హత్యకు గురైన వారిలో ఇద్దరేసి హిజ్రాలు, వలస  జీవులు, ఒకరు ఆటోడ్రైవర్‌ ఉన్నారు. పెళ్లికి నిరాకరించినందుకు నార్సింగిలో పల్నాడుకు చెందిన ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 12వేల ఇళ్లలో... 10కిపైగా ఓట్లు

ఓటరు జాబితాల్లో దొర్లిన తప్పిదాలను సరి చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. డూప్లికేట్‌, ఒకే డోర్‌ నెంబరులో 5కు మించి ఓట్లు ఉండడం, వలసలు వెళ్లిన వారి పేర్లు కొనసాగడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో గత నెల 31న తుది ఓటరు జాబితాలను వెలువరించారు.  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18,79,671 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా జాబితాల్లో భారీగా తప్పిదాలు దొర్లాయని, అర్హతలున్నప్పటికీ అనేక మంది పేర్లు తొలగించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యాప్‌లో ముంచిన ‘చేప’

ఫిష్‌ గ్రూప్‌ (జీఎస్‌ఏ) కంపెనీలో భాగస్వాములై పెట్టుబడి పెట్టండి. 60 రోజుల్లో మూడు రెట్లు తిరిగి ఇస్తామని చెప్పడంతో దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండల కేంద్రంలో గత మార్చిలో 2,023  మంది పెట్టుబడి పెట్టారు. ఫిష్‌ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ను తెరిచి తెలిసిన వారిని అందులో చేర్పించారు. లింక్‌ ఓపెన్‌ చేయగానే చేపల గ్రూప్‌లో పెట్టుబడి పెట్టాలని సభ్యులకు ఆహ్వానం అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సారొచ్చి వెళ్లారు.. అవస్థలు మిగిల్చారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా హడావుడిగా మురుగు కాల్వలు తీసిన గ్రామపంచాయతీ అధికారులు నిర్మాణాలు  వదిలేశారు. పత్తికొండ పట్టణంలో ఈ నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పట్టణంలోని కర్నూలు రహదారిలో కుడివైపు మురుగు కాల్వపై ఉన్న బండలు తొలగించి తవ్వారు. తర్వాత ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. త్వరగా స్థిరపడాలంటే మార్గం ఇదిగో!

కెరియర్‌లో స్థిరపడటానికి చిన్న నైపుణ్యాలూ దారిచూపుతాయి. చిన్న వయసులోనే ఎందులోనైనా ప్రావీణ్యం పొంది, రాణించాలనుకునేవారు ఒకేషనల్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ‘పనిచేయడం ద్వారా నేర్చుకోవటం’ వీటి ప్రత్యేకత! అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ప్రత్యేక శిక్షణ  అవసరం లేకుండా నేరుగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఒకేషనల్‌ విద్య అనంతరం డిప్లొమా, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు లేదా అందులోనే ఉన్నత విద్య బి.వోక్‌., ఎం.వోక్‌. చదువుకోవచ్చు. తక్కువ వ్యవధిలో ఉపాధిని ఆశించేవారు ఒకేషనల్‌ బాట పట్టవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమాత్యులకు ఆమాత్రం తీరిక లేదా?

అన్నమయ్య జిల్లాతో పోల్చితే వైయస్‌ఆర్‌ జిల్లాలో జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం పుణ్యమా అని అప్పుడప్పుడు డీఆర్సీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం జడ్పీ సమావేశం, సాయంత్రం డీఆర్సీ సమావేశం, అజెండా పుస్తకంలో పేజీలు తిప్పడం, చదవడం, ముగించడం వరకే పరిమితమవుతున్నాయి. ఈ విషయాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో ప్రస్తావించి ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోడ్‌ స్కాన్‌ చెయ్‌

విద్యార్థులకు పుస్తకాలు పూర్తి స్థాయిలో రాలేదు. ఉన్న వాటిని సర్దుబాటు చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఉండేందుకు పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. జాతీయ విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉపయోగపడేలా అంతర్జాలంలోనూ చదివేలా చర్యలు చేపట్టారు. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని మాధ్యమాల్లోని పుస్తకాలను అప్‌లోడ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మాటల మామ.. చేతలు మమ

‘ఇంటర్మీడియట్‌లోనూ బైజూస్‌ కంటెంట్‌ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలి. తర్వాత దశలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేలా సన్నద్ధం కావాలి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్రతి మండలంలోనూ రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలి. నాడు- నేడు కింద అదనపు తరగతి గదులు, వసతులు కల్పించాలి...’ ఇవీ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మాటలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని