logo

కోడ్‌ స్కాన్‌ చెయ్‌

విద్యార్థులకు పుస్తకాలు పూర్తి స్థాయిలో రాలేదు. ఉన్న వాటిని సర్దుబాటు చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఉండేందుకు పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Published : 22 Jun 2023 03:23 IST

‘క్యూఆర్‌’తో చరవాణిలోనే విద్యార్థికి సులభతరం
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జోగిపేట

విద్యార్థులకు పుస్తకాలు పూర్తి స్థాయిలో రాలేదు. ఉన్న వాటిని సర్దుబాటు చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఉండేందుకు పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. జాతీయ విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉపయోగపడేలా అంతర్జాలంలోనూ చదివేలా చర్యలు చేపట్టారు. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని మాధ్యమాల్లోని పుస్తకాలను అప్‌లోడ్‌ చేశారు.

అభ్యసన.. సాధన

అన్ని తరగతుల పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను 2023-24 విద్యా సంవత్సరంలో ముద్రించారు. దానిని చరవాణితో స్కాన్‌ చేస్తే చాలు.. పాఠ్యాంశాలతో పాటు అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉదాహరణలు, బొమ్మలు చరవాణిలోకి వస్తాయి. విద్యార్థులు అభ్యసన సామగ్రి నివేదికను సైతం అంతర్జాంలోనే పూర్తి చేయవచ్చు. పాఠాలు పూర్తయిన తరువాత సొంతంగా సాధన చేయొచ్చు. ఉపాధ్యాయుల పాఠ్యాంశాల ప్రణాళిక, వర్క్‌షీట్స్‌, ప్రయోగాలకు ‘దీక్ష’ ప్లాట్‌ఫామ్‌ యాప్‌ ఉపయోగించుకోవచ్చు. పాఠం విన్న తర్వాత సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. గతంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దీక్ష యాప్‌, అంతర్జాలాన్ని రూపొందించారు. చదవడం కంటే తెరపై చూస్తేనే విద్యార్థులకు త్వరగా అర్థం అవుతాయి. ఈ ఉద్దేశంతో 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలపై వీడియోలు రూపొందించి ఇందులో పొందుపరిచారు. తరగతి గదిలో కూర్చొని పాఠం వింటున్న అనుభూతి కలుగుతుంది.


అవగాహన కల్పిస్తున్నాం

వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి, సంగారెడ్డి

స్కాన్‌ చేసి పాఠాలు చూడటం, వినడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇచ్చాం. విద్యార్థి చరవాణిలోనూ పాఠ్యాంశాలు చూసుకొని ఇంటి వద్దనే చదువుకునే అవకాశం ఉంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా దీన్ని వినియోగించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు