logo

యాప్‌లో ముంచిన ‘చేప’

ఫిష్‌ గ్రూప్‌ (జీఎస్‌ఏ) కంపెనీలో భాగస్వాములై పెట్టుబడి పెట్టండి. 60 రోజుల్లో మూడు రెట్లు తిరిగి ఇస్తామని చెప్పడంతో దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండల కేంద్రంలో గత మార్చిలో 2,023  మంది పెట్టుబడి పెట్టారు.

Updated : 22 Jun 2023 04:48 IST

చేప యాప్‌లో ఉన్న జీఎస్‌ఏ గ్రూప్‌

దేవరకొండ, న్యూస్‌టుడే: ఫిష్‌ గ్రూప్‌ (జీఎస్‌ఏ) కంపెనీలో భాగస్వాములై పెట్టుబడి పెట్టండి. 60 రోజుల్లో మూడు రెట్లు తిరిగి ఇస్తామని చెప్పడంతో దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండల కేంద్రంలో గత మార్చిలో 2,023  మంది పెట్టుబడి పెట్టారు. ఫిష్‌ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ను తెరిచి తెలిసిన వారిని అందులో చేర్పించారు. లింక్‌ ఓపెన్‌ చేయగానే చేపల గ్రూప్‌లో పెట్టుబడి పెట్టాలని సభ్యులకు ఆహ్వానం అందించారు. కనీసం రూ.2 వేల నుంచి రూ.1.30 లక్షలు పెట్టుబడి పెడితే 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తామని, రోజువారీగా బ్యాంక్‌ అకౌంట్లో నగదు బదిలీ చేస్తామని నమ్మించి పలువురిని చేర్పించారు. గొలుసు విధానంలో 230 మందిని చేర్పిస్తే నెలకు రూ.20వేలు జీతం వస్తుందని చెబుతూ.. కొందరిని ఏజెంట్లుగా నియమించారు. దీంతో దేవరకొండ నియోజకవర్గంలో వేలాది మంది సభ్యత్వం పొందారు. కొంతకాలం సక్రమంగా బ్యాంక్‌ ద్వారా రోజువారీ నగదు బదిలీ జరిపి ఈనెల 15 నుంచి నిలిపివేశారు. సమాచారం ఆగిపోవడంతో మోసపోయామని బాధితులు గ్రహించి లబోదిబోమంటున్నారు.


యాప్‌ వల్ల నష్టపోయాను

అప్పం అంజిబాబు, బాధితుడు, దేవరకొండ

నేను రూ.2.5లక్షల వరకు యాప్‌లో పెట్టుబడి పెట్టాను. రూ.లక్ష వరకు వచ్చాయి. రూ.1.5 లక్షలు నష్టపోయాను. అంతేగాక మా బంధువుల దగ్గర నుంచి డబ్బులు తీసుకువచ్చి వారితో రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. ఇంతవరకు డబ్బులు పడడం లేదు. యాప్‌ నుంచి సమాధానం రావడం లేదు. బంధువులు ఇంటికొచ్చి పంచాయితీ చేస్తున్నారు.


ఎలాంటి ఫిర్యాదు రాలేదు

నాగేశ్వర్‌రావు, డీఎస్పీ

చేప యాప్‌ గురించి మాకు సమాచారం లేదు. ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని