White House: ప్రధాని పిలుపు మేరకు శ్వేతసౌధం విందులో చిరుధాన్యాల వంటకాలు..!

ప్రధాని మోదీ కోసం శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన అధికారిక విందు మెనూలో చిరుధాన్యాల వంటకాలు చేరాయి. ఈ మేరకు జిల్‌ బైడెన్‌ ఓ స్పెషల్‌ చెఫ్‌కు ఈ పని అప్పజెప్పారు.   

Published : 22 Jun 2023 08:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా చిరుధాన్యాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ చేస్తున్న యత్నానికి అమెరికా తొలి మహిళ జిల్‌ బైడెన్‌ స్పందించారు. నేడు శ్వేత సౌధం(White House) మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందు మెనూలో చిరుధాన్యాల వంటకాలను కూడా చేర్చారు. ఆమె గెస్ట్‌ చెఫ్‌ నీనా కుర్టిస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు శ్వేత సౌధం ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ క్రిస్‌ వెల్లడించారు. ఈ అధికారిక విందుకు సంబంధించిన మెనూను శ్వేతసౌధం పేస్ట్రీ చెఫ్‌ సుసీ మారిసన్‌ తయారు చేశారు.

విందులో ఫస్ట్‌కోర్స్‌లో.. మారినేటెడ్‌ మిల్లెట్‌, గ్రిల్డ్‌ కార్న్‌ కెర్నల్‌ సలాడ్‌, పుచ్చకాయ, అవకాడో సాస్‌ అందించనున్నారు. ఇక మెయిన్‌ కోర్స్‌లో స్టఫ్డ్‌ పోర్టబెల్లో మష్రూమ్స్‌, కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో, లెమెన్‌ దిల్‌ యోగర్ట్‌ సాస్‌, క్రిస్ప్‌డ్‌ మిల్లెట్‌ కేక్స్‌, వేసవి పానీయాలు ఉండనున్నాయి. 

ప్రధాని మోదీ మార్చిలో చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సును భారత్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యవసాయంలో రసాయనాల కారణంగా సమస్యలు వస్తున్నాయని.. వాటికి ‘శ్రీఅన్న’ పరిష్కారం చూపుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఐరాస కూడా 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని