ఇక వానల జోరు

ఎట్టకేలకు రుతుపవనాలు కదిలాయి. ఇంతకాలం ఎండల వేడి, ఉక్కపోతలతో అల్లాడిన రాష్ట్రంపై చల్లనిగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

Updated : 22 Jun 2023 05:52 IST

జనగామ జిల్లాలో 8 సె.మీ. వర్షం

ఈనాడు, హైదరాబాద్‌: ఎట్టకేలకు రుతుపవనాలు కదిలాయి. ఇంతకాలం ఎండల వేడి, ఉక్కపోతలతో అల్లాడిన రాష్ట్రంపై చల్లనిగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జనగామ జిల్లా మల్కాపూర్‌లో అత్యధికంగా 8.2, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 6.9, కల్వకుర్తి(నాగర్‌కర్నూల్‌)లో 5.8, మాడుగులపల్లి(నల్గొండ)లో 5.1, వేలేరు(హనుమకొండ)లో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం నుంచి అయిదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని, ఇవి కురిసే తీరును బట్టి నైరుతి రుతుపవనాలు గురువారం తెలంగాణలో విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ‘వరుసగా రెండు రోజులు అత్యధిక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతోపాటు అవి కొనసాగే అవకాశాలను పరిశీలించి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటిస్తాం. ప్రస్తుతం రుతుపవనాల ఆగమనాన్ని సూచించే చల్లని గాలులు వీస్తున్నాయి’ అని ఆమె వివరించారు. వేసవి ఎండల తీవ్రత బుధవారం కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • వర్షాలు ప్రారంభంకావడంతో ప్రజలతో పాటు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లూ ఊపిరి పీల్చుకున్నాయి. ఎండల వేడి తీవ్రత కారణంగా జూన్‌లోనూ విద్యుత్‌ వినియోగం తగ్గలేదు. బుధవారం మధ్యాహ్నం 2.29 గంటలకు రాష్ట్రంలో అత్యధిక విద్యుత్‌ డిమాండు 11,256 మెగావాట్లు నమోదైంది. సాయంత్రం వర్షాలు ప్రారంభంకావడంతో రాత్రి 8 గంటలకు 7,599 మెగావాట్లకు పడిపోయింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని