Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 07 Apr 2024 20:59 IST

1. అనకాపల్లి కోడిగుడ్డు.. కి.మీ రోడ్డు వేయలేకపోయింది: పవన్‌

‘‘అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది. కానీ, ఇప్పుడు అనకాపల్లి  కోడి గుడ్డు పేరు వింటున్నాం. కోడి గుడ్డు పెట్టింది.. ఇంకా పొదుగుతూనే ఉంది. వైకాపా కోడి.. ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని, ఒక విప్‌ను ఇచ్చింది. కానీ, ఒక్క కిలోమీటరు రోడ్డు కూడా వేయలేకపోయింది’’ అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి పవన్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

 2. రోడ్లపై గుంతలు పూడ్చలేరు.. 3 రాజధానులు కడతారట: చంద్రబాబు

అమరావతి రాజధానిగా ఉండి ఉంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పామర్రులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పామర్రు ఎన్టీఆర్ కూడలి జనసంద్రమయ్యింది. మచిలీపట్నం-విజయవాడ రహదారి కూడలి కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం ఉండేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత?

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిగా నివేదిత పేరు దాదాపు ఖరారైంది. కంటోన్మెంట్‌ భారాస నేతలతో అధినేత కేసీఆర్‌ ఇవాళ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, నివేదిత, క్రిశాంక్‌, గజ్జెల నగేష్‌ సహా ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. హిమాచల్ ప్రజలు కాంగ్రెస్‌కు పూర్తి మద్దతిస్తారు: ప్రియాంక గాంధీ

హిమాచల్‌ ప్రజలు లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు  పూర్తి మద్దతిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవైపు అధికారం కోసం భాజపా డబ్బు, ఏజెన్సీలను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని, మరోవైపు సత్యం, ధైర్యం, ఓర్పుతో కాంగ్రెస్ ముందుకెళ్తోందని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. 2030 నాటికి 8 లక్షల వాహన ఎగుమతులే లక్ష్యం: మారుతీ సుజుకీ

దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వాహన ఎగుమతుల్ని చేసిన కంపెనీ.. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త మోడళ్లను ఆవిష్కరించనునుంది. 2030నాటికి విదేశీ ఎగుమతులను 8లక్షల యూనిట్లకు చేర్చడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నిస్‌ రికార్డు.. దీర్ఘాయుష్షుకు ‘సీక్రెట్‌’ అదేనట!

ప్రపంచలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వూడ్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. ఈయన వయసు 111 సంవత్సరాలు. సౌత్‌పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటోన్న ఆయనకు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ బృందం సర్టిఫికేట్‌ అందజేసింది. అయితే, సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన చెప్పడం గమనార్హం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. భార్యను చంపి.. 200 ముక్కలుగా చేసి!

 భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని 200 ముక్కలుగా చేశాడో కిరాతక భర్త. ఆమె శరీర భాగాలను  తన ఇంట్లోనే వారం రోజుల పాటు దాచిన అతడు.. ఆ శరీర భాగాలను సమయం చూసి నదిలో పడేసిన ఘటన బ్రిటన్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూకేకి చెందిన నికోలస్ మెట్సన్ (28) హోలీ బ్రామ్లీ (26)కి ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. స్టబ్స్‌ పోరాటం వృథా.. బోణీ కొట్టిన ముంబయి

ఐపీఎల్‌-17 సీజన్‌లో ముంబయి ఖాతా తెరించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది. 235 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. స్టబ్స్‌ (71*; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) పోరాటం వృథా అయ్యింది. ఓపెనర్‌ పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8 ఫోర్లు. 3 సిక్స్‌లు), అభిషేక్ పొరెల్‌ (41; 31 బంతుల్లో 5 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘భాజపాలో చేరండి లేదా చర్యలు ఎదుర్కోండి’ అని దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయ్‌..: మమత

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) విరుచుకుపడ్డారు. తమ పార్టీ నేతల్ని ఆ సంస్థలు భాజపాలో చేరాలని అడుగుతున్నాయని.. లేదంటే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయంటూ ఆరోపించారు. ఆదివారం పురులియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో దీదీ మాట్లాడారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మోదీ త్వరలో లాంగ్ లీవ్‌పై వెళ్తారు.. ఇది ప్రజల గ్యారంటీ: జైరాం రమేశ్‌

సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ (Congress) ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌(Jairam Ramesh) మండిపడ్డారు. జూన్‌ 4 తర్వాత మోదీ ఇక లాంగ్‌ లీవ్‌ తీసుకోవాల్సి ఉంటుందని, ఇది భారత ప్రజల గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. గడిచిన పదేళ్లలో ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడంతో నిరాశలో ఉన్న మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు