Oldest man: అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నిస్‌ రికార్డు.. దీర్ఘాయుష్షుకు ‘సీక్రెట్‌’ అదేనట!

ప్రపంచలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వూడ్‌ (111) గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు.

Published : 08 Apr 2024 00:11 IST

లండన్‌: ప్రపంచలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వూడ్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. ఈయన వయసు 111 సంవత్సరాలు. సౌత్‌పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటోన్న ఆయనకు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ బృందం సర్టిఫికేట్‌ అందజేసింది. అయితే, సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన చెప్పడం గమనార్హం.

ఆగస్టు 26, 1912న జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వూడ్‌ జన్మించారు. టైటానిక్‌ నౌక మునిగిన కొన్ని రోజులకే పుట్టిన ఆయన.. తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన.. ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ జీవన విధానమే కారణమని చెప్పారు. ‘‘ఎప్పుడూ ధూమపానం చేయలేదు. మద్యం మాత్రం అరుదుగా తీసుకునేవాడిని. ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్‌ తీసుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి డైట్‌ పాటించలేదు. పూర్తిగా ఇది జీవనశైలితోపాటు నా అదృష్టమే’’ అని జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వూడ్‌ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం.. మారణహోమానికి ఆరు నెలలు

ఇప్పవరకు ఈ ఘనతను సాధించిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల వృద్ధుడు జువాన్‌ విసెంటే పెరెజ్‌ ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. జపాన్‌కు చెందిన మరో వృద్ధుడు గిసాబురో సోనోబే (113) మార్చి 31న చనిపోయాడు. దాంతో తాజా రికార్డు జాన్‌ ఆల్ర్ఫెడ్‌ పేరుమీద నమోదయ్యింది. ఇక స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్‌ మోరేరా (117) ప్రపంచంలోనే వృద్ధ మహిళగా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని