BRS: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత?

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది. 

Published : 07 Apr 2024 20:10 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిగా నివేదిత పేరు దాదాపు ఖరారైంది. కంటోన్మెంట్‌ భారాస నేతలతో అధినేత కేసీఆర్‌ ఇవాళ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, నివేదిత, క్రిశాంక్‌, గజ్జెల నగేష్‌ సహా ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై నేతలతో చర్చించిన కేసీఆర్‌.. వారికి దిశానిర్దేశం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కూడా జరగనుంది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపాలని భారాస అధినేత కేసీఆర్‌ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు నేతల సమావేశంలో నివేదిత పేరు చెప్పినట్టు సమాచారం. ఉగాది తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని