Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 Apr 2024 21:00 IST

1. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం.. సంకల్పంతో ముందుకెళ్లండి: చంద్రబాబు

రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంట్, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్‌లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఫామ్‌లు తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు - సునీత కేజ్రీవాల్‌ ఆరోపణ

 తిహాడ్‌ జైల్లో ఉన్న తన భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను చంపాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని సునీత కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆయనకు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. విపక్ష కూటమి ‘ఇండియా’ ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. రేణిగుంటలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2, కడప జిల్లా బలపనూరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మా అన్నయ్య జోలికొస్తే సహించేది లేదు: సజ్జలకు పవన్‌ వార్నింగ్‌

సీఎం జగన్‌ కులాల వారీగా ప్రజలను విడగొట్టే కొద్దీ తాను ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్‌ ప్రసంగించారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు.  సింహం సింగిల్‌గా వస్తుందంటున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. నాకూ అభిషేక్‌ బెనర్జీకీ ముప్పు పొంచి ఉంది: మమతా బెనర్జీ

 తనని, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని భాజపా టార్గెట్ చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాము సురక్షితంగా లేమని, తమకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. టీఎంసీ పార్టీ అభ్యర్థి, మంత్రి బిప్లబ్ మిత్రాకు మద్దతుగా  కుమార్‌గంజ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం తెలియదా? డెలాయిట్‌ హెచ్‌ఆర్‌ టిప్స్‌ ఇవే..

 ఇంటర్వ్యూ అంటేనే చాలా మందికి భయం. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని ఆందోళన చెందుతుంటారు. తెలియనివాటికి ఎలా సమాధానం చెప్పాలోనని గాబరా పడిపోతుంటారు. అయితే ముఖాముఖిలో అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియకపోవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని టిప్స్‌ పాటిస్తే చాలు అంటున్నారు ప్రముఖ హెచ్‌ఆర్‌ థెరిసా ఫ్రీమాన్‌. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ‘హర్మోజ్‌’ను ఇరాన్‌ అడ్డుకుంటే.. ఇంధనం ధరలకు రెక్కలే!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఘర్షణ వాతావరణం (Iran-Israel conflict) భారత్‌ సహా పలు దేశాల్లో చమురు ధరలపై పడనున్నట్లు అంచనా. సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో క్రూడ్‌ ఆయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుందని, చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారని విమర్శించారు. ‘‘సమాజంలో నిజానికి ఏ అన్న అయినా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి. అది ఆడబిడ్డ హక్కు. ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత’’ అని షర్మిల అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కాంగ్రెస్‌పై దాడి తప్పితే.. దేశ సమస్యలపై మోదీ మాట్లాడటం లేదు: పవార్‌ విమర్శలు

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls) వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రచార తీరుపై ఎన్సీపీ-ఎస్‌పీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా.. కేవలం ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమవుతున్నారన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఆ పదాలను తొలగించబోం..! ఈసీ నోటీసులపై ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్రలో శివసేన (యూబీటీ)కు చెందిన కొత్త ప్రచార గీతం వివాదంలో పడింది. అందులోని జైభవానీ, హిందూ అనే పదాలను తొలగించాలని సూచిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) తమకు నోటీసులు పంపిందని పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) వెల్లడించారు. అయితే.. ఈసీ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ గీతం నుంచి ఆ పదాలను తొలగించడం మహారాష్ట్రకు అవమానకరమని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని