icon icon icon
icon icon icon

Ys Sharmila: ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Updated : 21 Apr 2024 21:11 IST

కర్నూలు: ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుందని, చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారని విమర్శించారు.

‘‘సమాజంలో నిజానికి ఏ అన్న అయినా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి. అది ఆడబిడ్డ హక్కు. ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత. ఎందుకంటే తల్లి తర్వాత ఆ స్థానంలో నిలబడేది మేనమామే. ఇది సహజంగా అందరూ పాటించే నియమం. అయితే, కొంతమంది చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా భావించి.. తామేదో చెల్లికి గిఫ్ట్‌గా ఇస్తున్నామని బిల్డప్‌ ఇచ్చే వాళ్లు కూడా సమాజంలో ఉన్నారు. ఇంకొంతమంది వాటాగా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా.. చెల్లికి కొసరు ఇచ్చి, అదికూడా అప్పు ఇచ్చినట్టు చూపించేవారూ ఉన్నారు. ఇది వాస్తవమని మా కుటుంబం మొత్తానికీ తెలుసు, దేవుడికీ తెలుసు. వివేకా హంతకుడు అవినాష్‌ అని సీబీఐ చెబుతోంది. న్యాయం కోసం సునీత పోరాడుతోంది. మా పోరాటం ఆస్తుల కోసం కాదు.. న్యాయం కోసం. భవిష్యత్‌లో మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు. మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం’’ అని షర్మిల తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img