icon icon icon
icon icon icon

Lok Sabha Polls: కాంగ్రెస్‌పై దాడి తప్పితే.. దేశ సమస్యలపై మోదీ మాట్లాడటం లేదు: పవార్‌ విమర్శలు

కాంగ్రెస్‌పై మాటల దాడి చేయడం తప్పితే దేశ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటంలేదని శరద్‌ పవార్‌ విమర్శించారు.

Published : 21 Apr 2024 17:51 IST

జలగావ్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls) వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రచార తీరుపై ఎన్సీపీ-ఎస్‌పీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా.. కేవలం ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమవుతున్నారన్నారు. ఆదివారం ఆయన జలగావ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రులు ఎన్నికల ప్రచారంలో దేశ భవిష్యత్తుపై తమ విజన్‌ ఏంటో చెప్పేవారని పవార్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ, మోదీ మాత్రం తనదైన వాక్చాతుర్యంతో ప్రజల్ని ప్రభావితం చేసేందుకు వ్యక్తిగత దాడులు, కాంగ్రెస్‌ను నిందించడంతోనే సరిపోతుంది తప్ప.. దేశ సమస్యలపై మాట్లాడట్లేదని ఆక్షేపించారు.

ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం లేదని పవార్‌ విమర్శించారు. గాంధీ-నెహ్రూ భావజాలంతో జలగావ్‌ గుర్తింపు పొందిందని, అయితే, గత కొన్నేళ్లుగా కొన్ని అంశాల్లో మార్పు వచ్చిందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో జలగావ్‌, రేవర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో మహావికాస్‌ అఘాడీ (కాంగ్రెస్‌-శివసేన UBT-ఎన్సీపీ SP)కి అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img