Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 18 May 2024 20:59 IST

1.  ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్‌ భేటీ వాయిదా

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి రాకపోవడంతో కేబినెట్‌ భేటీని రద్దు చేశారు. శనివారం సాయంత్రం మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావించింది. ఇందుకు సంబంధించిన అజెండాను కూడా సీఎస్‌ సిద్ధం చేశారు. పూర్తి కథనం

2.  మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్‌ ఎవరంటే?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్స్‌కు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. దీన్ని దృష్టిలోపెట్టుకుని పలువురు దర్శక, నిర్మాతలు ప్రముఖుల జీవితాలను తెరపైకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే మరోసారి.. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ (Narendra Modi Biopic)కు రంగం సిద్ధమైనట్టు సమాచారం.పూర్తి కథనం

3. టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్‌

జూన్ 2 నుంచి (భారత కాలమానం ప్రకారం) టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో గ్రూప్‌ స్టేజ్‌లో టీమ్‌ఇండియా (IND vs PAK) తలపడనుంది. అయితే, ఆ ఒక్కసారే కాకుండా టైటిల్‌ పోరు దాయాదుల మధ్యే జరగాలని.. ఆ మ్యాచ్‌ వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ వ్యాఖ్యానించాడు.పూర్తి కథనం

4. 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్‌

టెక్నో మొబైల్స్‌ కెమన్‌ సిరీస్‌ (Tecno Camon Series)లో రెండు కొత్త ఫోన్లను భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది. టెక్నో కెమన్‌ 30 5జీ (Tecno Camon 30 5G), కెమన్‌ 30 ప్రీమియర్‌ 5జీ (Camon 30 Premier 5G) పేరిట వీటిని లాంచ్‌ చేసింది. 50ఎంపీ సెల్ఫీ కెమెరా,  5,000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ మొబైల్‌ ఇతర ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!పూర్తి కథనం

5. ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రలోభాల పర్వం సాగుతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల క్రమంలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది.పూర్తి కథనం

6. పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్‌స్కీ అభ్యర్థన

రష్యా యుద్ధంలో ఓడిపోతే.. అది అమెరికాకు దక్కిన విజయంగా చైనా భావిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) అన్నారు. పశ్చిమదేశాలు రష్యా-ఉక్రెయిన్ ల మధ్య సమతూకం తేవాలని కోరుకుంటున్నాయన్నారు. ఈ ప్రక్రియలో చైనా భాగం కావాలని కోరారు.పూర్తి కథనం

7. పుతిన్‌, జిన్‌పింగ్‌ ఆలింగనంపై.. వైట్‌హౌస్‌ జోకులు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ (Vladimir Putin) చైనా పర్యటనపై అమెరికా స్పందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను మర్యాదపూర్వకంగా కలిసిన పుతిన్‌ ఆయన్ను ఆలింగనం చేసుకోవడంపై వైట్‌హౌస్‌ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. పూర్తి కథనం

8. దీదీతో పొత్తుపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్‌ కాదు: ఖర్గే

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)పై తనకు నమ్మకం లేదని, ఆమె భాజపా(BJP) వైపు వెళ్లే అవకాశం ఉందంటూ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆమెను కూటమిలోకి తీసుకోవడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది తప్ప అధీర్‌ రంజన్‌ కాదన్నారు.పూర్తి కథనం

9. ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్‌ సింగ్‌, ఆడ్వాణీ

లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటు (Home voting)ను ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, కేంద్ర మాజీమంత్రి మురళీ మనోహర్‌ జోషి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పూర్తి కథనం

10. చైనా సైబర్‌ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం

విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలని చెప్పి.. చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లను విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గాజువాకకు చెందిన చుక్క రాజేశ్‌ ఇంజినీరింగ్‌ చదివి గల్ఫ్‌ దేశాల్లో పని చేశాడు. 2021 నుంచి ఆ దేశాలకు మ్యాన్‌ పవర్‌ సప్లయ్‌ చేయడం మొదలుపెట్టాడు.  పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని