Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 May 2024 17:05 IST

1. కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి

తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దొంగే దొంగ అన్నట్లుగా భారాస నేతల మాటలు ఉన్నాయి. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. పూర్తి కథనం

2. దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ

అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, సనాతన వ్యతిరేక ఆలోచనా విధానం కలిగిన విపక్షాల కూటమికి.. ఈ ఎన్నికల ఫలితాల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌లపై పరోక్షంగా విరుచుకుపడిన ఆయన.. సంపన్న కుటుంబాల్లో జన్మించిన వారికి సామాన్యుల కష్టాలు తెలియవన్నారు. తనకు వారసులు ఎవరూ లేరని, దేశ ప్రజలంతా తన వారసులేనన్నారు. పూర్తి కథనం

3. విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

గగనతలంలో విమాన ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. ఓ విమానం భారీ కుదుపులకు లోనైన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం.పూర్తి కథనం

4. తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం

తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను వైస్‌ ఛాన్సలర్‌(వీసీ)లుగా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి కథనం

5. సిట్‌ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్‌తో డీజీపీ భేటీ

రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్‌ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్‌ జవహర్‌రెడ్డితో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా భేటీ అయ్యారు. మంగళవారం సచివాలయంలో ఇద్దరు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సిట్‌ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సి చర్యలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.పూర్తి కథనం

6.ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్‌ భగవత్‌

 సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్‌ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు.పూర్తి కథనం

7.  కేన్స్‌లో ‘కన్నప్ప’ టీజర్‌.. రెస్పాన్స్‌పై విష్ణు పోస్ట్‌..

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్‌ను కేన్స్‌లో ప్రదర్శించారు. దీనిపై ఎంతో ఆనందంగా ఉందని ఆయన (Manchu Vishnu) పేర్కొన్నారు. పూర్తి కథనం

8. తొలి క్వాలిఫయర్‌.. అభిషేక్‌కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2024 సీజన్‌ తొలి క్వాలిఫయర్‌కు అహ్మదాబాద్‌ వేదిక. కోల్‌కతా X హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ల దూకుడుకు.. కేకేఆర్‌ బౌలింగ్‌కు అసలైన పోరు ఉంటుందని క్రికెట్ పండితుల అంచనా. ఈ క్రమంలో యువ బ్యాటర్ అభిషేక్ శర్మకు భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక సూచనలు చేశాడు.పూర్తి కథనం

9. ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు

ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడంతో చాలామంది అభిమానులు తీవ్ర వేదనకు గురయ్యారు. అందులో ఒకప్పటి సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్‌ సందర్భంగా రాయుడు కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆటను మళ్లీ చూస్తామా? లేదా? అనే అనుమానాలను మాత్రం రాయుడు కొట్టిపడేశాడు.పూర్తి కథనం

10. ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌

స్ఫూర్తిమంతమైన కథనాలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తన ఎక్స్‌ ఖాతాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha elections 2024) ఓటేసి ఒక చేతిలో ఓటరు కార్డు, వేలికి సిరా గుర్తు చూపిస్తున్న ఓ వ్యక్తి ఫొటో అది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు