Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Apr 2024 09:07 IST

1. గండం గట్టెక్కేదెలా!

రాష్ట్రంలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేవు. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్‌, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా..కృష్ణా పరీవాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ రావడం లేదు. పైపెచ్చు ఉన్న జలాలు వినియోగం అవుతుండటం, ఎండల కారణంగా నీరు ఆవిరవుతుండటంతో నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. పూర్తి కథనం

2. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, యూసీసీలను పశ్చిమబెంగాల్‌లో అమలు చేయబోం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)లను తమ రాష్ట్రంలో అమలు చేసేదే లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. రంజాన్‌ సందర్భంగా గురువారం రెడ్‌ రోడ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.పూర్తి కథనం

3. గురుకులాల్లో ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు మళ్లీ పరీక్ష

గురుకుల విద్యాసంస్థల్లో ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐఆర్‌బీ)కి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.పూర్తి కథనం

4. బడి ఈడులో జబ్బు.. నడి వయసులో ముప్పు!

చిన్నతనంలో తరచూ అస్వస్థతకు గురయ్యేవారా? తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడి.. నెల రోజులకు పైగా బడికి వెళ్లలేకపోయారా? అయితే ఇలాంటి వారు నడివయసు దాటాక బహుళ (రెండు.. అంతకంటే ఎక్కువ) దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ముప్పు పొంచి ఉంది. బాల్యంలో ఏవైనా జబ్బులతో బాధపడి.. ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో 25 శాతం మందికి బహుళ వ్యాధులు సోకుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.పూర్తి కథనం

5. పన్నేసి.. బతుకులు పిండేసి!

వార్షిక అద్దె విలువ(వీఆర్‌వీ) ఆధారంగా పట్టణ, నగరాల్లో అయిదేళ్లకోసారి ఆస్తి పన్ను పెంచేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వీఆర్‌వీకి బదులుగా ఆస్తి మూలధన విలువ(సీవీ) ఆధారంగా పన్ను పెంచే విధానం అమల్లోకి తెచ్చింది. దానికి మళ్లీ స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖతో లింకు పెట్టింది. ఆస్తుల విలువను.. ఆ శాఖ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా పెంచాలని నిర్ణయించింది.పూర్తి కథనం

6. పట్టాల పేరుతో జగన్మాయ..!

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఎక్కడో చోట స్థలాలపై  నాయకులకు సమస్య ఎదురవుతూనే ఉంది. ఎన్నికల వేళ ప్రచారానికి వెళ్తుంటే ఇచ్చిన పట్టాలు ఏం చేయాలంటూ వారినే నేరుగా ప్రశ్నిస్తుంటే వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎన్నికల కోడ్‌ రాకముందు ప్రతి ఇంటికి వెళ్లి నీ ఇంటికి ఇంత లబ్ధి జరిగిందంటూ గొప్పలు చెప్పుకొన్న వైకాపా నేతలకు తమకు ఇల్లు మంజూరు కాలేదు..పూర్తి కథనం

7. సజ్జల నకిలీ వార్తల ఫ్యాక్టరీ

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీని నడుపుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.పూర్తి కథనం

8. బీరు తెగ తాగుతున్రు.. భారీగా పెరిగిన అమ్మకాలు

మద్యం ప్రియులు తెగ తాగేస్తున్నారు..ఉమ్మడి జిల్లాలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఉష్ణోగ్రత తీవ్రతకుతోడు ఎన్నికల హడావుడి ఇందుకు కారణం. ఒకవైపు శుభకార్యాలు, మరోవైపు ఎన్నికలు, ఎండల తీవ్రతతో బీరు తాగడం ఎక్కువయ్యింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 261 మద్యం దుకాణాలు ఉన్నాయి..పూర్తి కథనం

9. ‘పూట గడవడమే కష్టంగా ఉంది.. జీతాలు ఎప్పుడొస్తాయమ్మా?’

ఏమమ్మా.. మనకు జీతాలు ఎప్పుడొస్తాయి? పూట గడవడమే కష్టంగా ఉంది. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. సమ్మె కాలానికి జీతమే ఇవ్వలేదు. మార్చి నెలదీ రాలేదు. నా జీతమే మా కుటుంబానికి ఆధారం. చాలా కష్టాలు పడుతున్నాం’. ఇదీ ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఫోన్‌ కాల్‌లో విలపించిన తీరు.పూర్తి కథనం

10. కినుక వహించిన చినుకు

చినుకు కినుక వహించింది. కురవనంటూ చిన్నబుచ్చుకుంది. వర్షానికి వర్షానికి మధ్య విరామం భారీగా ఉండటంతో రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కటకట పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు పంటలకు, నేలకు తేమను ఇచ్చే వర్షాలు అతి తక్కువగా పడటంతో భూగర్భ జల మట్టాలు పడిపోయాయి.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని