logo

బీరు తెగ తాగుతున్రు.. భారీగా పెరిగిన అమ్మకాలు

మద్యం ప్రియులు తెగ తాగేస్తున్నారు..ఉమ్మడి జిల్లాలో అమ్మకాలు భారీగా పెరిగాయి.

Updated : 12 Apr 2024 08:20 IST

న్యూస్‌టుడే, నారాయణపేట : మద్యం ప్రియులు తెగ తాగేస్తున్నారు..ఉమ్మడి జిల్లాలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఉష్ణోగ్రత తీవ్రతకుతోడు ఎన్నికల హడావుడి ఇందుకు కారణం. ఒకవైపు శుభకార్యాలు, మరోవైపు ఎన్నికలు, ఎండల తీవ్రతతో బీరు తాగడం ఎక్కువయ్యింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 261 మద్యం దుకాణాలు ఉన్నాయి.. గత ఏడాది మార్చి నెలలో 2,66,400 కాటన్ల మద్యం, 4,53,100 కార్టన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,92,326 కార్టన్ల లిక్కర్‌, 11,40,330 కార్టన్ల బీర్లు అమ్ముడుపోయాయి. ఒక్క మార్చి నెలలో గత ఏడాదికి సమానంగా అమ్మకాలు సాగాయి. 2023లో మార్చిలో జరిగిన లిక్కర్‌, బీర్ల అమ్మకం ద్వారా రూ.276.82కోట్లు,  ఈ ఏడాది మార్చిలోనూ రూ.245 కోట్ల వ్యాపారం జరిగినట్లు సంబంధితశాఖ సిబ్బంది తెలియజేస్తున్నారు.

వేసవిలో ఎక్కువే...

సహజంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతుంటాయి. బీర్లకు అసలైన సీజన్‌ వేసవిలో ఈ మూడు నెలలేనని గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా రాత్రి 10 గంటలోపు మద్యం దుకాణాలను మూసివేస్తున్నారు. రాత్రివేళల్లో బెల్టు దుకాణాలలో ఎప్పుడు పడితే అప్పుడు తెరుచుకునే ఉంటాయి. కొన్ని ధాబాల్లోనూ నిరంతరం మద్యం లభిస్తోంది. రాత్రి సమయంలో మద్యం బాబుల వీరంగం కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని