సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, యూసీసీలను పశ్చిమబెంగాల్‌లో అమలు చేయబోం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)లను తమ రాష్ట్రంలో అమలు చేసేదే లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.

Updated : 12 Apr 2024 06:19 IST

మమతా బెనర్జీ పునరుద్ఘాటన

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)లను తమ రాష్ట్రంలో అమలు చేసేదే లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. రంజాన్‌ సందర్భంగా గురువారం రెడ్‌ రోడ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొంతమంది మతం పేరుతో కలహాలను సృష్టించే పనిలో ఉన్నారని ఆరోపించారు. వీటిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు మాత్రం వారి మాయలº పడొద్దని విజ్ఞప్తి చేశారు. తాను జీవించి ఉన్నంత వరకూ ప్రజల కోసమే పోరాడతానని తెలిపారు. ఎన్నికల వేళ విపక్షాలను భయపెట్టేందుకు భాజపా దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని మమత మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని