Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Apr 2024 09:08 IST

1. జగన్‌.. ఇదేనా మీ విశ్వసనీయత?

2018లో చిత్తూరు పర్యటనలో పాడి రైతులకు న్యాయం చేస్తామని.. చెరకు రైతుల కష్టాలు తీరుస్తామని జగన్‌ హమీ ఇచ్చారు. అధికారంలో అయిదేళ్లున్నా నోటిమాటలే తప్ప ఒక్కటి కూడా నెరవేర్చకపోగా.. చిత్తూరు డెయిరీని తక్కువ ధరకే అమూల్‌కు కట్టబెట్టారు. చక్కెర కర్మాగారాల్ని అప్పనంగా అమ్మేసేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గానికి పులివెందులతో సమానంగా నిధులు కేటాయిస్తానని నమ్మించి మొండిచెయ్యి చూపారు. పూర్తి కథనం

2. రాజ్యసభతో మన్మోహన్‌ 33 ఏళ్ల అనుబంధానికి నేటితో తెర

రాజ్యసభ నుంచి మంగళ, బుధవారాల్లో మొత్తం 54 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ (91)తోపాటు 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో కొందరు మళ్లీ ఎగువ సభకు వచ్చే అవకాశం లేదు. రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం బుధవారంతో ముగియనుంది.పూర్తి కథనం

3. అనుకున్నట్లే చేసింది

ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొద్దిమందికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది. 86.33 శాతం పింఛనుదార్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకునేలా ఉత్తర్వులిచ్చింది. పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సరిపోరని.. వీరిలో కొందరికి వేర్వేరు విధులు ఉన్నాయని.. ఇలా పలు కారణాలు చూపించి చివరకు పింఛనర్లను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించేలా చేస్తోంది.పూర్తి కథనం

4. కేటీఆర్‌.. మీ కుటుంబం సంగతి చూసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

‘భారాస అధికారం కోల్పోయిన మూడు నెలల్లోపే కీలక నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు. మీ సోదరి కవిత మద్యం కేసులో కూరుకుపోయి తిహాడ్‌ జైల్లో ఉన్నారు.. ముందు మీ కుటుంబం, పార్టీ సంగతి చూసుకోండి’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విరుచుకుపడ్డారు. పూర్తి కథనం

5. బాటసారే.. కపటదారి

ఐదేళ్ల క్రితం ఓ బాటసారి ఊరూరా తిరిగాడు. మీ సమస్యలు నాకు చెప్పండి.. పరిష్కరిస్తానన్నాడు. నేనున్నానని నమ్మించాడు. ఆబాలగోపాలాన్ని ఉద్ధరిస్తానన్నాడు. అమాయకంగా ముఖం పెట్టి.. తండ్రి లేని బిడ్డనని.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చాలని వేడుకున్నాడు. అయ్యో పాపం అనుకుని ఒకసారి ఆదరిస్తే అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే నరకం చూపించాడు.పూర్తి కథనం

6. జలఘంటిక.. మేల్కోవాలిక

రాజధానిలో భూగర్భ జలాలు ఆవిరవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా.. గతంతో పోలిస్తే తాగునీటి సరఫరా సమయం, నీటి ఒత్తిడి చాలా వరకు తగ్గింది. సంపులోని నీరు సగం రోజుకే తరిగిపోతున్నాయి. దాంతో.. వేలాది మంది రోజూ ట్యాంకర్ల కోసం జలమండలిని సంప్రదిస్తున్నారు. పలు ప్రభుత్వ ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లలోనూ నీటి ఎద్దడి కనిపిస్తోంది.పూర్తి కథనం

7. జగన్‌ ధన దాహంతో కార్మికులు వీధిపాలు: లోకేశ్‌

జగన్‌ ధన దాహంతో ఇసుక అందుబాటులో లేక రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పాతబస్‌స్టాండ్‌ కూడలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కార్మికులతో మమేకమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.పూర్తి కథనం

8. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం

తెలంగాణలో కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్‌ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులున్నారు.పూర్తి కథనం

9. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయ్‌..!

భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. వ్యవసాయంతో పాటు గృహావసరాలకు అధికంగా వినియోగిస్తున్నారు. చెరువులు ఎండిపోవడం, కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు బావుల నుంచి విద్యుత్తు మోటార్ల ద్వారా నీరందిస్తున్నారు. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.పూర్తి కథనం

10. ఖమ్మంపై పీటముడి!

ఖమ్మం లోక్‌సభ సీటుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయమై పీటముడి పడింది. ఇది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్‌ ఇవ్వాలని కొందరు, ప్రభుత్వంలో ముఖ్య స్థానాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కాకుండా వేరొకరికి అవకాశమివ్వాలని మరికొందరు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ సీటుపై నిర్ణయం తీసుకోవడానికి మరో ఐదారు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని