Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Apr 2024 09:03 IST

1. పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్‌!

వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. పట్టణాల్లో వృద్ధి చెందుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నా మౌలిక వసతుల కల్పనలో జగన్‌ సర్కారు శ్రద్ధ   చూపలేదు. సీఎం స్వయంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు. పూర్తి కథనం

2. కాంగ్రెస్‌లో వలసల ప్రభావమెంత?

కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్‌సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ బలహీనంగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన చోటే కాకుండా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా చేరికలు కొనసాగుతున్నాయి. పూర్తి కథనం

3. తాగునీరో జగనన్న!!

వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రజలు తాగునీటికీ కష్టాలు పడ్డారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నేటికీ ఆ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కనీసం అందుబాటులో ఉన్న పథకాలనూ సద్వినియోగం చేసుకోని ఈ సర్కారు గతంలో నిర్మించిన వాటినీ మూలకు తోసేసింది. కొత్తగా మంజూరైనా చర్యలు తీసుకోలేదు.పూర్తి కథనం

4. ఎండలతో ఉక్కిరిబిక్కిరి

జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.పూర్తి కథనం

5. రైతు జపం.. ఏదో నెపం

ప్రతి కౌలు రైతుకూ.. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులిస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చూస్తాం. వారికి అన్ని రకాలుగా తోడుంటాం’ అని 2018లో జగన్‌మోహన్‌రెడ్డి సంకల్ప యాత్రలో హామీ ఇచ్చినా.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఒరిగిందేమీ లేదు.పూర్తి కథనం

6. ఓట్టేద్దాం..ఓరుగల్లు వైభవాన్ని కాపాడుదాం

ఉమ్మడి వరంగల్‌ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేక వీటిలో కొన్ని మరుగున పడుతున్నాయి. పూర్తి కథనం

7. జగన్‌... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు

కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చిన జగన్‌ మాత్రం కొల్లేరును కొల్లగొట్టిస్తున్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజాప్రతినిధుల అండతో 5వ కాంటూరులో వేలాది ఎకరాల్లో చెరువులు తవ్వేశారు. విశాఖ, కృష్ణా జిల్లాల వైకాపా నాయకులు సైతం చెరువులు సాగు చేస్తున్నారు.పూర్తి కథనం

8. అయిదేళ్లు.. పరిశ్రమలు కుదేలు!

ఉమ్మడి జిల్లా జనపనార పరిశ్రమలకు ప్రసిద్ధి. గోగుసాగు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ముడిసరకు కొరత లేకపోవడంతో పరిశ్రమలను స్థాపించారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, నెలిమర్ల, కొత్తవలసలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి. పలువురు మిల్లుల్లో ఉద్యోగాలతో జీవనం సాగించేవారు.పూర్తి కథనం

9. రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!

సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌(ఈసీ) కూడా అదే చెబుతుంది. అయితే కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దున ఉంటాయి. వీరికి తెలంగాణ, మహారాష్ట్రల నుంచి ఓటరు కార్డులు మంజూరయ్యాయి. దీంతో వీరు రెండు చోట్ల ఓటు వేస్తుంటారు.పూర్తి కథనం

10. బంతికో వంద జోరుగా దందా

జిల్లాలో ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) బెట్టింగ్‌ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్‌ పడితే మరో రేటు.. ఇలా ఐపీఎల్‌ బెట్టింగ్‌లో బుకీలకు కాసుల వర్షం కురుస్తోంది. దీనికి కొందరు యువత బలహీనంగా మారి జేబులు గుల్ల చేసుకోవడంతో పాటు ప్రాణాలను తీసుకుంటున్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని