logo

బంతికో వంద జోరుగా దందా

జిల్లాలో ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) బెట్టింగ్‌ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్‌ పడితే మరో రేటు..

Updated : 18 Apr 2024 08:36 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) బెట్టింగ్‌ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్‌ పడితే మరో రేటు.. ఇలా ఐపీఎల్‌ బెట్టింగ్‌లో బుకీలకు కాసుల వర్షం కురుస్తోంది. దీనికి కొందరు యువత బలహీనంగా మారి జేబులు గుల్ల చేసుకోవడంతో పాటు ప్రాణాలను తీసుకుంటున్నారు. రాత్రి 7 గంటలు అయితే క్రికెట్‌ వీరాభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. అంతటితో ఆగకుండా కొందరు చరవాణి ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు. మద్యం దుకాణాల పక్కన ఉండే సిట్టింగ్‌లు మొదలుకొని పట్టణ శివారు ప్రాంతాల్లో ఉండే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ బెట్టింగ్‌లు కడుతున్నారు.

ఇలా మొదలుపెట్టి..

బెట్టింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ఒక యాప్‌ సృష్టించి.. బుకీలతో ఒప్పందం కుదుర్చుకున్న నిర్వాహకులు ఒక ఐడీ ఇస్తారు. ఆ ఐడీ లాగిన్‌ అయితే దాని ద్వారా పోటీలో ఉన్న ఆటగాళ్లు ఓవర్‌లో ఎంత కొడతారు.. బాల్‌కు ఎన్నిరన్స్‌ వస్తాయి.. వికెట్‌ పడుతుందా అంటూ పలు విధాలుగా దాని పక్కన బెట్టింగ్‌ డబ్బులు ఉంటుంది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నగదు సంపాదించవచ్చనే వ్యామోహంతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇలా బెట్టింగ్‌లకు పాల్పడి పోలీసులకు పట్టుకున్న వారిలో చిన్నచితక వారు మాత్రమే ఉంటున్నారు. భారీ స్థాయిల్లో మోసాలకు పాల్పడేవారు తప్పించుకు తిరుగుతున్నారు.


నిఘా పెంచాం..

ఎస్పీ చందనా దీప్తి

ఐపీఎల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో పాటు ఇతర బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెంచాం. జిల్లాలో ఇప్పటికే పలువురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. బెట్టింగ్‌లకు పాల్పడేవారి సమాచారం 100 నంబర్‌తో పాటు సమీప పోలీస్‌ స్టేషన్లలో చెప్పవచ్చు. చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని