Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Mar 2024 09:01 IST

1. ఇదీ జగన్‌ క్రమ‘బద్ధకీ’కరణ

మాటలతో మాయ చేయడంలో తనను మించిన ఘనులు లేరని సీఎం జగన్‌ పదేపదే నిరూపించుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చాక వంచించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. 2019 ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న హామీతో వారిలో ఆశలు కల్పించారు. తీరా    అధికారంలోకి వచ్చాక నిబంధనల సాకుతో    సాగదీసి, కొంతమందికి మాత్రమే చేసి చేతులెత్తేశారు. పూర్తి కథనం

2. ఇందిర, రాజీవ్‌ల స్ఫూర్తికి కులగణన విరుద్ధం

కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామంటూ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్‌శర్మ భిన్నస్వరం వినిపించారు. ‘కులగణన’ దివ్యౌషధం ఏమీ కాదని.. నిరుద్యోగం, అసమానతలను తొలగించదని అన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ గుర్తింపు రాజకీయాలు చేయలేదంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.పూర్తి కథనం

3. వైకాపా పాలనలో దోచుకోవడానికే ప్రాధాన్యం: ఎంపీ

అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడీ చేసి స్వార్థం కోసం పాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్‌ అని ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. తెదేపా ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మడపాం గ్రామం నుంచి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మడపాం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన జగన్‌ను ఈ ఎన్నికల్లో సాగనంపాలని అన్నారు.పూర్తి కథనం

4. రూ.లక్షకు మించి విత్‌డ్రా చేసినా.. డిపాజిట్‌ చేసినా ఆరా

బ్యాంకుల నుంచి రూ.లక్ష అంతకు మించి చేపట్టిన లావాదేవీలపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా, డిపాజిట్‌ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది. ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసిందిపూర్తి కథనం

5. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు

మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేగం పెంచింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. పూర్తి కథనం

6. ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్‌కు..

‘ఏయ్‌ ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్‌కు’ అంటూ పోలీసులు రైతును మెడ పట్టుకుని నెట్టివేసి.. కొట్టారు. ఆ అవమాన భారాన్ని భరించలేక ఆ అన్నదాత పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందారు. రైతు భార్య సంపూర్ణమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మర్రిమాకుల కండ్రిగకు చెందిన చెంగయ్య, పాపమ్మలకు ముగ్గురు సంతానం.పూర్తి కథనం

7. సర్కారులో జీతం... పార్టీలో సేవాగీతం

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు పునరావాస కేంద్రంగా మారింది. వీరంతా వివిధ కేడర్లలో పని చేస్తున్నట్లు ఏపీఎండీసీ రికార్డుల్లో ఉంది. వీళ్లు మాత్రం వైకాపా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఏపీఎండీసీ ఉద్యోగులుగా చూపించి, సంస్థ నుంచి నాలుగైదేళ్లలో లక్షల రూపాయల జీతాలు చెల్లించారు.పూర్తి కథనం

8. బలమైనోళ్లు.. బలగమున్నోళ్లు

ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడింది.. గురువారం గ్రేటర్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో.. ఇక పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగనున్నారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మల్కాజిగిరి నుంచి వికారాబాద్‌ జడ్పీ ఛైరపర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. పూర్తి కథనం

9. నిద్రలేమితో ఉద్యోగుల్లో బద్ధకం

నిద్రలేమితో సతమతమవుతున్న నగరవాసుల్లో 56 శాతం మంది పనివేళల్లో నిద్రమత్తుతో బద్ధకంగా ఉంటున్నారని ‘వేక్‌ఫిట్‌ గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌ స్కోర్‌కార్డ్‌ 2024’ సర్వే వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంలో 10వేల మంది ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి నగరవ్యాప్తంగా స్లీప్‌ ట్రెండ్స్‌ వివరాలను వెల్లడించింది. పూర్తి కథనం

10. అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు.. ఓటర్లు ఎటు?

సార్వత్రిక ఎన్నికల వేళ చేవెళ్ల రాజకీయం రసకందాయంగా మారుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమరం సమయంలో ఆ పార్టీలో ఉన్న వాళ్లు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో ఉన్న వాళ్లు ఆ పార్టీలోకి మారడం సర్వసాధారణమైంది. ఈ పరిణామం ఓటర్లను ఒకింత గందరగోళానికి గురిచేస్తోంది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని