Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 May 2024 13:02 IST

1. గంటలో వస్తానన్న పిన్నెల్లి.. ఇప్పుడెక్కడ దాక్కున్నారు?: జూలకంటి

చట్టం, ప్రజాస్వామ్యంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గౌరవం లేదని తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డి విమర్శించారు. గంటలో మాచర్ల వస్తానన్న ఆయన.. ఇప్పుడెక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పరారీ వెనక సజ్జల వంటి పెద్దల సహకారం ఉందని ఆరోపించారు. పూర్తి కథనం

2. ‘చలో మాచర్ల’పై పోలీసుల ఆంక్షలు.. తెదేపా నేతల గృహ నిర్బంధం

మాచర్లలో పిన్నెల్లి బాధితుల పరామర్శకు వెళ్లాలని తెదేపా నేతలు నిర్ణయించారు. ఈక్రమంలో ఆ పార్టీ నేతలు చేపట్టిన ‘చలో మాచర్ల’పై పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరులో నక్కా ఆనంద్‌, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్యను గృహ నిర్బంధంలో ఉంచారు.పూర్తి కథనం

3. జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం బంద్‌: మంత్రి కోమటిరెడ్డి

జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భారాస నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.పూర్తి కథనం

4. కాంగ్రెస్‌ అధికారంలో దాడులు పెరిగాయి..: మాజీ మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే భారాస శ్రేణులపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే ఇద్దరు భారాస నేతలు హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్‌ ప్రభుత్వం భయపెట్టలేదని స్పష్టం చేశారు.పూర్తి కథనం

5. నిందితుడి అరెస్టుకు.. ఏకంగా ఎమర్జెన్సీ వార్డుకే పోలీసు వాహనం

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసు వాహనం ఏకంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు దూసుకొచ్చింది. ఎయిమ్స్‌ రిషికేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.పూర్తి కథనం

6. పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెల్లడిస్తే గందరగోళమే: సుప్రీంకు ఈసీ అఫిడవిట్‌

ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెబ్‌సైట్లో వెల్లడిస్తే అది గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్‌ దాఖలు చేసింది.పూర్తి కథనం

7. బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!

సింగపుర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం కుదుపులకు లోనై ఓ ప్రయాణికుడు మరణించగా.. 30 మందికి పైగా గాయపడటం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు విమానాలు గాల్లో ఉన్నవేళ ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ మొదలైంది. పూర్తి కథనం

8. పొత్తికడుపు గాయంతో బాధపడ్డా..: అశ్విన్‌

రాజస్థాన్‌ జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (2/19) పదునైన బౌలింగ్‌తో బెంగళూరును అడ్డుకున్నాడు. అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ‘‘ఈ సీజన్‌ తొలి అర్ధభాగంలో నా శరీరం అనుకున్నంతమేర సహకరించలేదు. అసౌకర్యంగా అనిపించింది. పొత్తికడుపులో గాయం ఇబ్బందికి గురి చేసింది. దాని నుంచి కోలుకుని వచ్చా’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.పూర్తి కథనం

9. ‘డీకే’ను ఓదార్చిన విరాట్ కోహ్లీ.. ఘనంగా ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్’

ఐపీఎల్‌ నుంచి ఆర్సీబీ ఫినిషర్‌ దినేశ్‌ కార్తిక్‌ వీడ్కోలు పలికాడు. ఈ సీజన్‌లో డీకే 15 మ్యాచుల్లో 187.36 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తన నిర్ణయం ప్రకటించిన తర్వాత భావోద్వేగానికి గురై ఇబ్బంది పడిన డీకేను హత్తుకొని విరాట్ కోహ్లీ ఓదార్చాడు. ఆటగాళ్లతో కార్తిక్‌కు ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ ఇప్పించాడు.పూర్తి కథనం

10. భారత్‌లో బంగ్లా ఎంపీ హత్య ఘటన.. ఆ బ్యాగుల్లో ఏముందో..?

భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అజీమ్‌ దారుణ హత్య గురైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన అదృశ్యమై రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు మృతదేహం లభ్యం కాలేదు. కోల్‌కతాలోని టౌన్‌హాల్‌ నుంచి ఇద్దరు పెద్ద బ్యాగుల్ని వెంట తీసుకెళ్లడం కనిపించిందని పోలీసులు చెప్పారు. వాటిల్లో ఏమున్నాయో తెలియాల్సి ఉంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని