Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Mar 2024 08:59 IST

1. తగ్గిపోతున్న యువ జనాభా!

దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. ఇప్పటివరకు విద్యావంతులు, చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న ఈ రాష్ట్రాల్లో భవిష్యత్తులో డిమాండ్‌కు తగినంత యువ కార్మిక బలగం అందుబాటులో ఉండదని హెచ్చరించింది. పూర్తి కథనం

2. పైసలు కాదు.. ప్రయాణమే ముఖ్యం

ఇరవై కిలోమీటర్ల సిటీ బస్సు ప్రయాణానికి రూ.35.. 20 కిలోమీటర్ల మెట్రో ప్రయాణానికి రూ.50 వసూలు చేస్తున్నారు.. 20 కిలోమీటర్ల ఎంఎంటీఎస్‌ ప్రయాణానికి కేవలం రూ.5 మాత్రమే. బస్సులో గంటలకొద్దీ ప్రయాణ సమయం పడుతున్నా.. సీటు దొరక్కపోయినా, కాలుష్యం బారిన పడుతున్నా..అందులోనే ప్రయాణిస్తున్నారు. పూర్తి కథనం

3. మీకో దండం.. మీతో ఉండం

మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్‌కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. వీరందరూ ఎన్నికల నేపథ్యంలో వైకాపా నాయకుల ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తిగత కారణాలను చూపిస్తూ.. రాజీనామాలు సమర్పించారు. పూర్తి కథనం

4. న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు

జ్యుడిషియల్‌ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్‌ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తనకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఈ నెల 26న కోర్టు జారీచేసిన ఉత్తర్వులను జైలు అధికారులు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె గురువారం ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.పూర్తి కథనం

5. మూడు రాజధానులు ఏర్పాటు చేశాం

‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. ఆ మూడు రాజధానులు ఎక్కడున్నాయి? జనం అమాయకులు, తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుందనుకున్నారో ఏమో కానీ జగన్‌ చాలా అలవోకగా ఇలాంటి అబద్ధాలను వల్లె వేశారు. పూర్తి కథనం

6. పదేళ్ల ‘రిపోర్టు కార్డ్‌’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్‌ ప్రశ్న

మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మహిళా, శిశుఅభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. గడిచిన పదేళ్లలో ఆ శాఖ ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని డిమాండ్‌ చేసింది. మహిళా సమస్యలపై కాంగ్రెస్‌ నేతలు ఇటీవల అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ.. వాటిలో ఏ ఒక్కదానికీ కేంద్ర మంత్రి స్పందించలేదని తెలిపింది.పూర్తి కథనం

7. సూపర్‌ఫాస్ట్‌ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!

షాలిమార్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వారాంతపు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమస్యను పరిష్కరిస్తామని రైలును ఏకంగా 5:30 గంటలపాటు నిలిపివేయడంతో అంతసేపు బోగీల్లో కూర్చోలేక ఇబ్బందిపడ్డారు. చివరికి ఆందోళన చేసి, రైల్వే సిబ్బందిని నిలదీస్తే తాత్కాలిక మరమ్మతులు చేసి రైలును వదిలారు.పూర్తి కథనం

8. బల్దియా హస్తగతం!

గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేయడానికి అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అనేక పురపాలక సంఘాలు, నగరపాలక సంఘాల పరిధిలో గత ఎన్నికల్లో భారాస అభ్యర్థులు గెలిచినా కూడా చాలా చోట్ల వీరంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో పాలకవర్గాలన్నీ కాంగ్రెస్‌ చేతికి వస్తున్నాయి.పూర్తి కథనం

9.‘అగ్నివీర్‌’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్‌

ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్‌/అగ్నిపథ్‌ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతను సాయుధ బలగాల్లో తీసుకుంటున్నారని అన్నారు.పూర్తి కథనం

10. భయపెడుతున్న భువన్‌.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంటిపన్నులు భయపెడుతున్నాయి. భువన్‌ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్‌ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను  జారీ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి పన్నుల ప్రకారం లెక్కగట్టి కొంత మేరకు పెంచితే సరిపోతుంది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని