Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 24 May 2024 21:00 IST

1. బాగానే ఉన్నా.. నా ఆరోగ్యంపై భాజపా అబద్ధాలు చెబుతోంది: నవీన్‌ పట్నాయక్‌

తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్లు ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ స్పష్టంచేశారు.  ఆరోగ్యం, వృద్ధాప్యం కారణంగా నవీన్‌ పట్నాయక్‌కు విశ్రాంతి ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచారంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పూర్తి కథనం

2. హైదరాబాద్‌ మెట్రో రైలు సమయంలో స్వల్ప మార్పు!

హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ప్రతి శుక్రవారం రాత్రి 11.45గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్‌ పెట్టారు. పూర్తి కథనం

3. ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ‘కల్కి’పై అమితాబ్‌ కామెంట్స్‌

నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అశ్వత్థామ పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పూర్తి కథనం

4. యువీ - క్రిస్‌ గేల్‌తోపాటు టీ20 ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా మరో స్టార్‌

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని టీ20 ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. యూఎస్ఏ - విండీస్ సంయుక్త ఆతిథ్యంలో జూన్ 2 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది.  2009 టైటిల్‌ను పాక్‌ నెగ్గడంలో అఫ్రిది కీలకపాత్ర పోషించాడు. పూర్తి కథనం

5.  రేపల్లె సమీపంలో ట్రాక్టరు బోల్తా.. 20 మందికి గాయాలు

బాపట్ల జిల్లా రేపల్లె మండలం చాట్రగడ్డ శివారులో ట్రాక్టరు బోల్తాపడి 20 మందికి గాయాలయ్యాయి. నగరం మండలం ఉయ్యూరువారిపాలెం గ్రామ దేవర కొలువుల నేపథ్యంలో రేపల్లె మండలం, కొల్లిపర మండలం దావులూరుకు చెందిన ఉయ్యూరు వంశీయులు మోర్తోట వెళ్లారు.  పూర్తి కథనం

6. పరువు నష్టం కేసు.. దోషిగా తేలిన మేధా పాట్కర్‌

ఓ క్రిమినల్‌ పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్‌’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ (Medha Patkar)ను దిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. 2000 నాటికి చెందిన ఈ కేసును ప్రస్తుతం దిల్లీ ఎల్‌జీగా ఉన్న వీకే సక్సేనా (VK Saxena) దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ ఈమేరకు తీర్పు వెలువరించారు. పూర్తి కథనం

7. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి కథనం

8. ప్రజ్వల్‌ రేవణ్ణను విదేశాలకు పంపిందే దేవెగౌడ: సిద్ధరామయ్య

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడు, హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను (prajwal revanna) హెచ్చరిస్తూ ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) విడుదల చేసిన ప్రకటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం

9. 22 ఎంఎంటీఎస్‌, 4 డెమూ రైళ్లు రద్దు.. కారణం ఇదే!

హైదరాబాద్‌ జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించేవారికి కీలక అలర్ట్‌! ఈనెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు, నాలుగు డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పూర్తి కథనం

10. జగన్నాథుడి ఇలాకాలో విజయం ఎవరిదో?

నిత్యం హరి నామస్మరణతో మార్మోగిపోయే పూరీ క్షేత్రంలో రాజకీయ వేడి రాజుకుంది. జగన్నాథుడు కొలువైన ప్రతిష్ఠాత్మక పూరీ లోక్‌సభ స్థానాన్ని (Puri Lok Sabha Constituency) కైవసం చేసుకునేందుకు భాజపా (BJP), బిజు జనతాదళ్‌ (BJD) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని