Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jun 2024 13:03 IST

1. రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: చంద్రబాబు

ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు  రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. పూర్తి కథనం

2. ‘మరీ అంత నిజాయతీ వద్దేమో’: ఎన్నికల ఫలితాలపై ప్రముఖ నటుడి పోస్టు వైరల్‌

ఈ సార్వత్రిక ఎన్నికల్లో 240 సీట్లు గెలుచుకొని భాజపా(BJP) ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు, ఫలితాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో కూడా పరాజయం పాలుకావడం భాజపాకు దిగ్భ్రాంతి కలిగించేదే.పూర్తి కథనం

3. పిఠాపురంలో పవన్‌ గెలుపు.. తన పేరు మార్పుపై స్పందించిన ముద్రగడ

పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్‌ విసిరిన మాజీ మంత్రి మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కిర్లంపూడిలో మీడియాతో ఆయన మాట్లాడారు.పూర్తి కథనం

4. భారత్‌తో మరింత బలమైన బంధం.. మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజల శ్రేయస్సుకు ఆయన కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. మోదీ నేతృత్వంలోని భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.పూర్తి కథనం

5. సజ్జల ఆధ్వర్యంలో ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌: డొక్కా మాణిక్య వరప్రసాద్‌

తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని చెప్పారు.పూర్తి కథనం

6. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 96 టేబుళ్లపై కౌంటింగ్‌ సాగుతోంది. ఇందులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పోలింగ్‌ను మే 27న నిర్వహించారు.పూర్తి కథనం

7. ‘భారత ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు’.. లోక్‌సభ ఎన్నికలపై అమెరికా స్పందన

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. స్పష్టమైన ఆధిక్యంతో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని చేపట్టనుంది. ప్రధానమంత్రి మోదీ మరోసారి పాలనా పగ్గాలు అందుకోనున్నారు. ఈ సందర్భంగా మన దేశ ప్రజలు, ప్రభుత్వానికి అమెరికా అభినందనలు తెలియజేసింది.పూర్తి కథనం

8. 48 ఓట్ల తేడాతో గెలుపు.. ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ వీరికే

యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన భారత సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Election Results) ప్రజల తీర్పు ఎలాఉందో స్పష్టమైంది. గతంతో పోలిస్తే విపక్ష ఇండియా కూటమి మెరిపించినా.. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎన్డీయే కైవసం చేసుకుంది. పూర్తి కథనం

9. ఒకే విమానంలో నీతీశ్‌, తేజస్వి.. కీలక భేటీల వేళ ఆసక్తికర పరిణామం

ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా సొంతంగా 272  సీట్ల మెజార్టీ మార్కును దాటలేకపోవడం, అటు విపక్ష ‘ఇండియా’ కూటమి అనూహ్యంగా పుంజుకున్న తరుణంలో బుధవారం రాజకీయ పక్షాలు కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నాయి. ఈ తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.పూర్తి కథనం

10. ఆ ఇద్దరు.. ఆ కల నెలవేర్చుకుంటారా!

మళ్లీ వెస్టిండీస్‌లో ప్రపంచకప్‌ వచ్చింది. కాకపోతే విండీస్‌ సహ ఆతిథ్య జట్టు. కానీ భారత్‌ పరిస్థితి మాత్రం ఏం మారలేదు. ఈసారీ వన్డే ప్రపంచకప్‌లో పరాభవం ఎదుర్కొంది. అయితే 2007లోలా తొలి రౌండ్లోనే ఇంటికి రాలేదు. సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు వెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని బాధను మిగిల్చింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని