Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 18 Apr 2024 12:59 IST

1. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్‌ అన్న కుమారుడిపై మరో కేసు

మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఐదుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. పూర్తి కథనం

2. రాహుల్ స్పూన్‌ ఫీడింగ్‌ కిడ్‌.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్‌

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధైర్యంగా భాజపా (BJP)కు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న వ్యాఖ్యలను ఆ పార్టీ మాజీ నేత గులాం నబీఆజాద్ (Ghulam Nabi Azad) తోసిపుచ్చారు. ఆయన చర్యలు అలా అనిపించడం లేదని, భాజపా పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు సంకోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు.పూర్తి కథనం

3. మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్‌రెడ్డి

ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. తాము ఎవరికీ బీ టీం కాదని చెప్పారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం

4. ఎన్‌కౌంటర్ల ‘లక్ష్మణ్‌’.. మావోయిస్టులకు సింగం

ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ కేవట్‌ (Laxman Kewat).. ఈ పేరు చెబితే మావోయిస్టులకు గుండె దద్దరిల్లుతుంది. అవును మరి.. తన 17 ఏళ్ల కెరీర్‌లో దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారాయన. బెదిరింపులను లెక్కచేయకుండా మావోయిస్టులను ఏరిపారేస్తున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా ఆపరేషన్లలో పాల్గొన్నారు.పూర్తి కథనం

5. ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్‌ పంత్

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను పంత్‌సేన చిత్తు చేసింది. ఆ జట్టు విసిరిన కేవలం 90 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ తొమ్మిది ఓవర్లలోపే పూర్తి చేసింది. దీంతో రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రిషభ్‌ పంత్ (Rishabh Pant) జట్టు వ్యూహంపై స్పందించాడుపూర్తి కథనం

6. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాఫర్‌ డ్యామ్‌ కట్టడంలేదు: కేటీఆర్‌

కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలపై ఎక్స్(ట్విటర్‌) వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్‌ డ్యామ్‌ కట్టి మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోరారు.పూర్తి కథనం

7. నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్‌ ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ వార్నింగ్‌ 

పాకిస్థాన్‌ (Pakistan) ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీ అరెస్టుకు మునీరే కారణమని ఆరోపించారు. ఆమె ప్రస్తుతం ఓ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు.పూర్తి కథనం

8. ఐరాసలో భారత్‌కు వీటో అధికారం.. మస్క్‌ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..

భద్రతా మండలి (UNSC) సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ బుధవారం స్పష్టం చేసింది. యూఎన్‌ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇటీవల ప్రస్తావించిన విషయం తెలిసిందే.పూర్తి కథనం

9. గూగుల్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!

వాషింగ్టన్‌: ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు (Google layoffs) సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాసిన అంతర్గత లేఖలో వెల్లడించారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.పూర్తి కథనం

10. కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. తెదేపా నేతకు తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 12వ వార్డులో తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని